Begin typing your search above and press return to search.

'తీస్ మార్ ఖాన్' ట్రైలర్: హిట్టు కోసం లాఠీ పట్టిన ఆది..!

By:  Tupaki Desk   |   8 Aug 2022 11:01 AM GMT
తీస్ మార్ ఖాన్ ట్రైలర్: హిట్టు కోసం లాఠీ పట్టిన ఆది..!
X
ఆది సాయి కుమార్ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోడానికి చాలాకాలంగా కష్టపడుతున్నాడు. విభిన్నమైన జోనర్స్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయిన ఆది.. ఇప్పుడు ''తీస్ మార్ ఖాన్'' అనే చిత్రంతో రాబోతున్నాడు.

'తీస్ మార్ ఖాన్' చిత్రానికి కల్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు. 'స్టూడెంట్ - రౌడీ - పోలీస్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో ఆది సరసన 'Rx 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. సునీల్ - పూర్ణ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

సక్సెస్ కోసం ఆది ఈసారి పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైన్ సినిమాతో రాబోతున్నట్లు ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. స్టూడెంట్ గా.. 'గబ్బర్ సింగ్' స్టైల్ లో రౌడీ పోలీస్ గా వెరీయేషన్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఆది అన్నా వదిన లుగా సునీల్ - పూర్ణ నటించారు.

అయితే పోలీసాఫీసర్ గా ఆది దూకుడు స్వభావం వల్ల విలన్స్ అతని ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు.. వారి ఆట ఎలా కట్టించాడు అనేదే 'తీస్ మార్ ఖాన్' మెయిన్ ప్లాట్ గా ట్రైలర్ ని బట్టి అర్థం అవుతుంది. ఇందులో ఆది రౌడీ కాప్ గా డాషింగ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించడంతో పాటు చాలా ఈజ్ తో నటించాడు.

ఆది సాయి కుమార్ లవ్ ఇంట్రెస్ట్ గా నటించిన పాయల్ రాజ్‌ పుత్ ఎప్పటిలాగే సూపర్ హాట్ గా కనిపించింది. ప్రధాన జోడీ మధ్య రొమాన్స్ పాళ్లు కాస్త ఎక్కువే అని ట్రైలర్ తో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో కబీర్ సింగ్ - అనూప్ సింగ్ ఠాకూర్ విలన్స్ గా కనిపించగా.. శ్రీకాంత్ అయ్యంగార్ - హేమంత్ ఇతర పాత్రల్లో నటించారు.

'తీస్‌ మార్‌ ఖాన్‌' అనేది పక్కా రెగ్యులర్ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది. అలానే ఇది ఆది వన్ మ్యాన్ షోగా కనిపిస్తుంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ మాస్ ఆడియెన్స్‌‌ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. సాయి కార్తీక్ దీనికి సంగీతం సమకూర్చారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. మణికాంత్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

'తీస్ మార్ ఖాన్' సినిమాని విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి నిర్మించారు. ఆగస్టు 19న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ - ట్రైలర్ విడుదల చేయగా.. లేటెస్టుగా మరో ట్రైలర్ వదిలి సినిమాపై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశారు.

గతంలో సాయి కుమార్ ఖాకీ ధరించి అనేక విజయాలు అందుకున్నారు. మరి ఇప్పుడు 'TMK' సినిమాతో ఆయన తనయుడు ఆది ఎలాంటి ఫలితాన్ని సక్సెస్ అందుకుంటారో చూడాలి.