Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్ : నేచుర‌ల్ స్టార్ మాసీవ్ ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామా

By:  Tupaki Desk   |   30 Jan 2023 4:38 PM
టీజ‌ర్ టాక్ : నేచుర‌ల్ స్టార్ మాసీవ్ ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామా
X
నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో తొలిసారి ఊర మాస‌పీవ్ పాత్ర‌ల న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా 'ద‌స‌రా'. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ ద్వారా యంగ్ టాలెంటెడ్ శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీని ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు నాని క‌నిపించ‌ని మాసీవ్ అవ‌తార్ లో న‌టించిన మూవీ కావ‌డంతో స‌హ‌జంగానే ఈ సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ పోస్ట‌ర్స్, లిరిక‌ల్ వీడియోలు, వ‌న్నెల పాత్ర‌లో డీ గ్లామ‌ర్ గా క‌నిపిస్తున్న కీర్తి సురేష్ మాసీవ్ మేకోవ‌ర్ స్టిల్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ని పెంచేశాయి. 'నేను లోక‌ల్‌' మూవీతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట మ‌రో సారి క‌లిసి చేస్తున్న‌ప సినిమా ఇది. గోదావ‌రిఖ‌ని కోల్ మైన్స్ నేప‌థ్యంలో సాగే అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ మూవీని ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల తెర‌కెక్కిస్తున్నారు. 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే ఈ మూవీపై హీరో నాని భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు.

మార్చి 30న తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. గ్లిమ్స్ కి ఊహించిన రెస్సాన్స్ ల‌భించిన నేప‌థ్యంలో సోమ‌వారం చిత్ర బృందం ఈ మూవీ టీజ‌ర్ ని ఐదు భాష‌ల్లో ఐదుగురు సెల‌బ్రిటీల‌తో విడుద‌ల చేయించింది. తెలుగులో ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి విడుద‌ల చేయ‌గా, త‌మిళంలో ధ‌నుష్‌, మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌న్న‌డలో ర‌క్షిత్ శెట్టి, హిందీలో షాహీద్ క‌పూర్ విడుద‌ల చేశారు.

ప‌ది త‌ల‌ల రావ‌ణాసుడి క‌టౌట్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. ఈర్ల‌ప‌ల్లి.. సుట్టూరా బొగ్గు కుప్ప‌లు..తొంగి జూత్తెగానీ క‌నిపియ్య‌ని ఊరు.. అంటూ నాని డైలాగ్ ల‌తో క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. మందంటే మాకు య‌స‌నం కాదుఅల‌వాటు ప‌డిన సంప్ర‌దాయం...నీ య‌వ‌వ్వ ఎట్లైతే గ‌ట్లాయె గుండు గుత్త‌గ లేపేద్దాం బాంచ్చెత్‌..' అంటూ నాని చెబుతున్న డైలాగ్ లు.. టీజ‌ర్ లో క‌నిపిస్తున్న ఇంటెన్స్ మాసీవ్ డ్రామా.. బొగ్గు గ‌నిలో ప‌ని చేసే కార్మికుడిగా నేచుర‌ల్ స్టార్ నాని క‌నిపిస్తున్న తీరు... ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

పొయ్యి బుక్కెడు బువ్వ‌తిని పండుకో పోరా... అంటూ సాయి కుమార్ చూపిస్తున్న విల‌నీ.. మ‌ల‌యాళ న‌టుడు షీనే గోమ్ చాకో విల‌నీ.. ఫ‌స్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వ‌ర‌కు నాని మాసిన గ‌డ్డం, లుంగీ, ష‌ర్ట్ లో క‌నిపించిన తీరు ఇదొక ఇంటెన్స్ యాక్ష‌న్‌ డ్రామా అని స్ప‌ష్టం చేస్తోంది. టీజ‌ర్ చివ‌ర్లో నాని రక్తం ఓడుతూ నోట్లో క‌త్తి ప‌ట్టుకుని అదే క‌త్తికి త‌న వేసిని క‌ట్ చేసి త‌న‌కు తానే ర‌క్త తిల‌కం దిద్దుకున్న సాట్ ఓ రేంజ్ లో వుంది. సినిమా చూస్తుంటే యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల ప‌తాక స్థాయిలో తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. సినిమాలో నాని ద‌ర‌ణి అనే స్ల‌మ్ ఏరియా యువ‌కుడిగా న‌టిస్తున్నాడు.

స‌త్య‌న్ సూర్య‌న్ ఫొటోగ్ర‌ఫీ, సంతోష్ నారాయ‌ణ్ నేప‌థ్య సంగీతం సినిమాకు ఆయువు ప‌ట్టుగాలా క‌నిపిస్తున్నాయి. చాలా కాలం త‌రువాత‌ ఊర మాసీవ్ నేప‌థ్యంలో సాగే ప‌క్కా తెలంగాణ నేప‌థ్యంలో సాగే సినిమాగా 'ద‌స‌రా' వుండ‌నుంద‌ని, ఇది ఇంటెన్స్ డ్రామాతో సాగే మాసీవ్ డ్రామా అని టీజ‌ర్ క్లారిటీ ఇచ్చేసింది. మార్చి 30న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీలో స‌ముద్ర‌ఖ‌ని, సాయి కుమార్‌, జ‌రీనా వాహెబ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.