నందమూరి తారకరత్న ఇటీవలే మృతి చెందిన విషయం తెల్సిందే. గుండె పోటుతో చిన్న వయసులోనే మృతి చెందిన తారకరత్న కు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు కాగా ఒక అబ్బాయి. కొడుకు అందరికంటే చిన్నవాడు. తండ్రి లేని విషయం కూడా ఇప్పటి వరకు ఆ పిల్లాడు అర్థం చేసుకునే వయసు కాదు. ఇంకా తండ్రి వస్తాడని ఎదురు చూసే వయసు.
ఇటీవల తండ్రి ఫొటోను పట్టుకున్న తారకరత్న కొడుకు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంత చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆ కుర్రాడిని చూస్తే గుండెలు ద్రవిస్తున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలను తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి షేర్ చేశారు. తండ్రి జ్ఞాపకాల్లో పిల్లలు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
తారకరత్న కొడుకు తాన్యారామ్ పెద్దయ్యాక తాను తన తండ్రిలా అవుతాను అంటూ ఫేక్ కు తన తండ్రి ఫేస్ ను పెట్టుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలేఖ్య ప్రస్తుతం తన పిల్లలతో కలిసి సింగిల్ మదర్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.
హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ సక్సెస్ దక్కక పోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా కూడా సినిమాల్లో నటించాడు.
రాజకీయాల్లో క్రియాశీలం అవ్వాలని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా హార్ట్ ఎటాక్ తో మృతి చెండంతో ఆయన అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.