Begin typing your search above and press return to search.
NTR30 చివరికి విరహ వేదనగా మారుతోంది!
By: Tupaki Desk | 15 Jan 2022 11:30 AMతమ అభిమాన కథానాయకుడు వెంట వెంటనే సినిమాల్లో నటించి రిలీజ్ చేయాలని ఏ అభిమాని అయినా కోరుకోవడం సహజం. అయితే ఏళ్లతరబడి భారీ సినిమాల షూటింగుల పేరుతో డిలే చేస్తే సహించడం కష్టం. ఒక్కోసారి అసహనంతో సోషల్ మీడియాల్లో వీరంగం వేసే మాస్ ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. కానీ తారక్ అభిమానులు రెండేళ్లుగా ఎంతో సహనంతో ఉన్నారు. తమ ఫేవరెట్ ని పల్లెత్తు మాటనలేదు.
ఇప్పటి వరకూ ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో లాక్ అయిపోయిన తారక్ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. కానీ ఇంకా ఆగేట్టు లేరు. రెండేళ్లుగా తారక్ నటించిన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ఆర్.ఆర్.ఆర్ ఈ సంక్రాంతికి వస్తుందని భావిస్తే చివరి నిమిషంలో వాయిదా పడింది. అంతేకాదు #NTR30 వాయిదా కూడా ఇబ్బందికరంగానే భావిస్తున్నారు. కొరటాల శివతో రెండవసారి తారక్ ఈ మూవీ కోసం కలుస్తున్నాడు. ఈ సినిమా గతేడాది సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా ఎన్టీఆర్ రాజమౌళితో బిజీ కాగా.. కొరటాల శివ ఆచార్యతో బిజీగా ఉన్నారు. కమిట్ మెంట్ లతో ఆలస్యమైంది. ఇప్పటికీ ఫ్యాన్స్ మరోసారి నిరాశ పడినట్టే కనిపిస్తోంది. #NTR30 లాంచ్ మరింత ఆలస్యం అవుతుందని తాజా సన్నివేశం చెబుతోంది.
కొరటాల శివ ఇప్పటికీ ఆచార్యను ముగించలేదు. మేకర్స్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ అంతకంతకు విస్తరిస్తూ బెంబేలెత్తిస్తోంది. దీనివల్ల భారీ చిత్రాలు విడుదల కాకుండా క్యూ లైన్ లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం పడుతుంది. ఎన్టీఆర్ చివరి విడుదల 2018లో జరిగింది. అప్పటినుంచి రిలీజ్ అన్నదే లేదు. కనీసం ఈ ఏడాదిలో అయినా తారక్ ని థియేటర్లలో చూసుకోవాలని అభిమానులు తపన పడుతున్నారు. కానీ అది సాధ్యపడేట్టు లేదు. కోవిడ్ ఉప్పెన కారణంగా RRR విడుదల వాయిదా పడింది. దీనితో అభిమానులు ఇంకా తీవ్ర నిరాశలోకి వెళ్లిపోతున్నారు. ఎన్టీఆర్ 30 ఆలస్యం అవుతుండటంతో అభిమానుల అంతులేని నిరీక్షణ కొనసాగుతోంది. ఇది చివరికి విరహ వేదనగా మారుతోంది.