రీ రిలీజ్ ట్రెండ్.. ఈసారి తారక్ మూవీ!

Fri Mar 31 2023 10:35:12 GMT+0530 (India Standard Time)

Tarak Simhadri Film ReRelease

జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయేది సింహాద్రి. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం ఇది కావడం విశేషం. హాయ్ వోల్టేజ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా కమర్షియల్ హీరోగా ఇమేజ్ తీసుకొచ్చింది.ఈ మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోగా తారక్ ఎదిగాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో పాత చిత్రాలను మళ్లీ తిరిగి రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారింది. పోకిరి సినిమాని రీ రిలీజ్ చేసి ఈ ట్రెండ్ స్టార్ట్ చేశారు. గతంలో ఎప్పుడో మాయాబజార్ సినిమాని కలర్స్ లోకి మార్చి రీ రిలీజ్ చేశారు. ఆ తర్వాత పోకిరి మూవీ రీ రిలీజ్ చేసి కొత్తవరవడికి శ్రీకారం చుట్టారు.

 వీటికి కలెక్షన్స్ కూడా బాగా వస్తూ ఉండడంతో ప్రత్యేకంగా ఫ్యాన్స్ షోలుగా ప్రదర్శిస్తూ ఉన్నారు. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలను ఇప్పటివరకు రిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ రాబట్టారు.

వీటి ద్వారా వచ్చే కలెక్షన్స్ సోషల్ యాక్టివిటీస్ కి ఉపయోగిస్తూ ఉండడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో డిజాస్టర్ మూవీ అయిన ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేశారు.

ఈ సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఏప్రిల్ 6న అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దేశముదురు సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన చిత్రంగా నిలిచిన సింహాద్రి మూవీని తిరిగి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. రీల్స్ లో తెరకెక్కించిన ఆ సినిమాని ప్రస్తుతం డిజిటలైజ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు.

 ఈ డిజిటలైజ్ కంప్లీట్ అయిన తర్వాత 4కె లోకి మార్చి రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయనున్నారు. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతుంది. ఈ సందర్భంగా సింహాద్రి సినిమాని రీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. మరి ఈ సినిమా రీ రిలీజ్ ద్వారా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాపడుతుంది అనేది చూడాలి.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.