నువ్వా? నేనా? అన్నట్లే ఉందే కథ!

Mon Mar 27 2023 10:01:21 GMT+0530 (India Standard Time)

Tarak-Charan is now coming solo at the box office

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య గట్టి పోటీ క్రియేట్ అవుతోందా? అంతర్గతంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ గా ఫేమస్ అయ్యారు. హాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ఇక టైగర్ మ్యాన్ ఆఫ్ ది మాస్ గా కొత్త ట్యాగ్ సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా వైడ్ ఇద్దరి మార్కెట్ ఇప్పుడు సరిసమానం.



హిందీ పరిశ్రమ నుంచి ఇద్దరికి అవకాశాలు వస్తున్నాయి. దీంతో తదుపరి సినిమా విషయంలో ఇద్దరు అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చరణ్-తారక్ కంటే ముందుగానే మేల్కోని  దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ ని లాక్ చేసి ముందుకెళ్తున్నారు. తారక్ 30వ సినిమా విషయంలో జరిగిన తర్జనభర్జన తెలిసిందే. అయితే ఇప్పుడీ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని తాజా సంకేతాల్ని బట్టి తెలుస్తోంది.

శంకర్ సినిమాకి ఏ మాత్రం తీసిపోకుండానే కొరటాల శివ కథపై వర్క్ చేసినట్లు కనిపిస్తుంది. తారక్ కోసం ఏకంగా హాలీవుడ్ ప్రఖ్యాత యాక్షన్ కొరియోగ్రాఫర్లు దించుతున్నారు. ఇక్కడే కొరటాల-తారక్  ఇంటెన్షన్ బయట పడుతుంది. కథని పాన్ ఇండియాకి కనెక్ట్ చేయడం కోసం కొరటాల ఎంతగా శ్రమించారో  తొలి నుంచి చూస్తున్నదే. ఏకంగా ఏదాది కాలం ఈ స్ర్కిప్ట్ పై వర్క్ చేసారు.

ఒక్క హిట్ తో తనపై పడ్డ మరక చేరుపుకోవాలన్నది కొరటాల పట్టుదల ఒకవైపు కనిపిస్తుంటే..మరోవైపు 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత అంతకు మంచి ఉండేలా? కథ కోసం కొరటాలని సానబెట్టడంలో యంగ్ టైగర్  కీలక పాత్ర పోషించారు. పాన్ ఇండియా సినిమా అంటే? ఏదో చేస్తున్నారులే అన్న ప్రచారం తప్ప! టైగర్ 30 పై ఎంత సీరియస్ గా ఉన్నారో? ఇప్పుడిప్పుడే ఒక్కోక్కటిగా లీక్ అవుతుంది.

చరణ్-శంకర్ కాంబినేషన్ కి ఏ మాత్రం తగ్గకుండా కొరటాల-ఎన్టీఆర్ కాంబో కూడా కనిపిస్తుందని బజ్ మొదలైంది. ఆర్ ఆర్ ఆర్ లో కలిసి నటించినా?  తారక్-చరణ్ ఇప్పుడు సోలోగా బాక్సాఫీస్ ముందుకు రావడంతో  ఇద్దరి మధ్య వ్యక్తిగత పోటీ ఉంటుందని పరిశ్రమలో గుస గుస మొదలైంది. దీంతో అభిమాను లు డీవీయేట్ అవుతున్నారు. ఇప్పటివరకూ ఇద్దరు ఒక్కటే కావడంతో ఫ్యాన్స్ అలాగే కనిపించారు.

కానీ తాజా మార్పులతో సన్నివేశం మరింత హీటెక్కుతోంది.  బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఫిగర్ ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని చెప్పకనే చెబుతుందని కొత్త ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి 'ఆర్ ఆర్ ఆర్' లో టైగర్ పాత్ర విషయంలో అభిమానులు తీవ్ర నిరుత్సాహన్ని వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే. చరణ్ కి ధీటుగా తారక్ పాత్ర లేదని అభిమానలు థియేటర్ల స్ర్కీన్లని..తలుపులు..కుర్చీలు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొరటాల రూపంలో తారక్  ఇప్పుడు  వాటన్నింటికి బధులివ్వబోతున్నాడు! అంటూ ఫ్యాన్స్ లో నూతనోత్సాహం మొదలైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.