రాజశేఖర్ తో సెల్ఫీ.. నోరువిప్పిన తారా చౌదరి

Fri Aug 10 2018 15:40:33 GMT+0530 (IST)

ఒక్క ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివిధ మీడియా సంస్థల్లో గాసిప్పులకు కారణమైంది. హీరో రాజశేఖర్ తో నటి తారా చౌదరి దిగిన ఫొటోపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని ఇష్టమొచ్చినట్టు రాసేశారు. ఈ విషయంలో ఓసారి రాజశేఖర్ స్వయంగా వివరణ ఇచ్చినా చల్లారలేదు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారా చౌదరి స్పందించింది. హీరో రాజశేఖర్ తో తనకున్న బంధాన్ని వివరించింది.
 
తారా చౌదరి మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రాజశేఖర్ నటించిన ‘మా అన్నయ్య’ సినిమా చూశా.. ఆ సినిమాతో ఆయన ఫ్యాన్ గా మారిపోయాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక షూటింగ్ లో రాజశేఖర్ గారిని మీట్ అయ్యాను. ఆయన అభిమానినని పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత తాను ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని ఫ్లాట్ పక్కన   ఇంటిలోకి చేరేందుకు రాజశేఖర్-జీవిత వచ్చి చూశారు. స్థలం సరిపోదని వెళ్లిపోయారు. ఆ సమయంలోనే రాజశేఖర్ గారితో తాను సెల్ఫీ దిగాను. ఆ ఫొటో చూసి నన్ను రకరకాలుగా బ్లేమ్ చేశారు. వాళ్లను కూడా బెదిరించినట్టు తెలిసింది ’ అని తారా వాపోయింది.'రాజశేఖర్ కు - నాకు సంబంధం పెడుతూ వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఇలాంటి వార్తలు మళ్లీ రానియ్యకండి.. ఆయన చాలా మంచోడు.. ' అంటూ చివరగా తారా వివరణ ఇచ్చింది.