Begin typing your search above and press return to search.

బుల్లెట్ బండెక్కిన తాప్సీ ఉమెన్ రైట్స్!

By:  Tupaki Desk   |   16 May 2022 1:30 PM GMT
బుల్లెట్ బండెక్కిన తాప్సీ ఉమెన్ రైట్స్!
X
తాప్సీ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్ కి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి బాలీవుడ్ పైనే ఫోక‌స్ పెట్టి ప‌నిచేస్తుంది. ఇదే స‌మ‌యంలో అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ‌ని సొంతంగా స్థాపించింది. హిందీ ప‌రిశ్ర‌మ‌కి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు..యువ ప్ర‌తిభావంతుల్ని ప్రోత్స‌హించాల‌నే సంకల్పంతో నిర్మాణ సంస్థ‌ని స్థాపించింది.

నిజానికి అవుట్ సైడ‌ర్స్ లాంచ్ అయిన ద‌గ్గ‌ర నుంచి నిర్మాణంపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. న‌టిగా సినిమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ ఫోక‌స్ అంతా నిర్మాణంపైనే పెట్టింది. ఇటీవ‌లే ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఆ సినిమా సెట్స్ లో ఉంది. ఇంత‌లో రెండ‌వ ప్రాజెక్ట్ ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. `ధ‌క్ ధ‌క్` అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇందులో ఫాతిమా ష‌నా సేక్.. ర‌త్న పాఠ‌క్ షా..దియా మీర్జాలు..సంజ‌న సంఘీలు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌రుణ్ దూదేజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ఇందులో న‌లుగురు న‌టీమ‌ణులు బైక్ పై రైడ్ కి బ‌య‌ల్దేరారు. బుల్లెట్ బండిపై న‌లుగురు హీరోయిన్ల ఆహ్లాద‌ర‌కంగా కనిపిస్తున్నారు. పోస్ట‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది.

ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. మ‌హిళా స్వేచ్ఛ‌ని చాటి చెప్పే చిత్ర‌మిది. మ‌హిళ‌ల హ‌క్కుల గురించి సినిమాలో ప్ర‌స్తావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సినిమా లో చ‌క్క‌ని వినోదం ఉంటుంద‌ని టాక్. ప్ర‌స్తుతం సినిమా కి సంబంధించి నిర్మాణ పనులు జ‌రుగుతున్నాయి. షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తిచేసి 2023లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని తాప్సీ వ‌యో కామ్ 18 సంస్థ‌తో క‌లిసి నిర్మిస్తుంది.

ఇక తాప్సీ న‌టిగా చేస్తోన్న లైన‌ప్ చూస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. ఏకంగా ఏనిమిది..తొమ్మిది ప్రాజెక్ట్ ల్లో న‌టిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉండ‌గా..మ‌రికొన్ని ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇటీవ‌లే `డంకీ` సినిమాలోనూ ఎంపికైంది. మ‌రి ఇవ‌న్నీ రిలీజ్ అయి ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తోయో చూడాలి.