సమంత - కాజల్ బాటలో తమన్నా...?

Tue Aug 11 2020 21:30:03 GMT+0530 (IST)

Kajal on the way to Samantha - Tamanna ...?

రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే హవా కాబోతోందని భావిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఇప్పటికే వెబ్ సిరీస్ లలో నటిస్తున్నప్పటికే సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ సమంత - ప్రియమణి 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో నటించారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది కాజల్. అయితే ఇప్పుడు వీరి బాటలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా నడవనుందని తెలుస్తోంది.తమన్నా ప్రస్తుతం గోపిచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందాలు ఆరబోస్తూ వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ వారు యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ ప్రొడక్షన్ హౌసెస్ కలిసి నిర్మిస్తున్న 'రాధే శ్యామ్' సినిమాలో ముందుగా తమన్నాని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసి ఫుల్ పేమెంట్ కూడా ఎప్పుడో ఇచ్చేశారట. అయితే ప్రభాస్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోవడం.. తమన్నా సీనియర్ హీరోలతో సినిమాలు చేసేయడంతో ఆమె ప్లేస్ లోకి పూజాహెగ్డే వచ్చి చేరిందట. దీంతో తమన్నా తో వెబ్ సిరీస్ ప్లాన్ చేశారట. ఇదిలా ఉండగా తమన్నా ఓ తమిళ్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోందని సమాచారం. రామ సుబ్రహ్మణ్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ''ది నవంబర్స్ స్టోరీ'' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోందట. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.