లెహంగాలో రెట్టింపు అందంతో ఆకట్టుకుంటున్న బాహుబలి బ్యూటీ!!

Mon Aug 10 2020 12:00:59 GMT+0530 (IST)

Tamannah Latest Stunning Pose In Lehanga

ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు గడుస్తున్నా మిల్కీ బ్యూటీ తమన్నా అందం కొంచం కూడా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికి తన అందాలతో సినీప్రియులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం తమన్నా గోపీచంద్ సరసన సీటీమార్ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్నాతో బెంగాల్ టైగర్ తెరకెక్కించిన సంపత్ నంది ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా తెలంగాణ జట్టు కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపిస్తుందట. తెలంగాణ అమ్మాయిగా కనపడటానికి తమన్నా చాలానే మేకోవర్ అయి ప్రస్తుతం తెలంగాణ యాస కూడా నేర్చుకుంటోంది. ఇక ఈ మిల్కీ బ్యూటీ అందాలను ఆరాధించే అభిమానులు మిలియన్లలో ఉన్నారు.అమ్మడు ఎలా కనిపించినా అంతే సంగతి. కుర్రాళ్ళ మతులు పోవడం ఖాయం. అలాంటి సోయగం తమన్నా సొంతం. తాజాగా లెహంగాలో దర్శనమిచ్చింది. రెడ్ కలర్ లెహంగాలో గోల్డ్ మిక్సడ్ టాప్ తో అమ్మడి అందాలు ఉట్టి పడుతున్నాయి. కెరీర్ మొదటి నుండి హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ తో ఇంతటి స్టార్డం సొంతం చేసుకుంది తమన్నా. చేతుల పై బంగారు చేపల పొలుసుల లాంటి డిజైన్లతో ధగ ధగ మెరిసిపోతుంది. ఇక ఈ ఫోటో చూస్తూ నెటిజన్లు కళ్లప్పగించేస్తున్నారు. తాజాగా కన్నడ హిట్ ఫిల్మ్ 'లవ్ మోక్ టైల్' తెలుగు రీమేక్ లో ఛాన్స్ కొట్టేసింది భామ. ఇందులో యంగ్ హీరో సత్యదేవ్ తో జతకట్టనుంది. అయితే నాగశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ సెప్టెంబర్ నుండి షూటింగ్ ప్రారంభం కానుందని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీ కానుందన్న మాట తమన్నా బేబీ.