మిల్కీ బ్యూటీ ఆ థై షో ఏమిటి?

Tue Oct 08 2019 09:56:44 GMT+0530 (IST)

Tamannaah bhatia Thighs Show

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తన కెరీర్ బెస్ట్ రోల్ లో నటించిన ఆనందంలో ఉందిప్పుడు. బాహుబలి చిత్రంతో తనకు దక్కనిది.. సైరాతో దక్కింది అన్న జోష్ తనలో కనిపిస్తోంది. బాహుబలి సిరీస్ లో అంతగా ప్రాధాన్యత లేని అవంతికగా నటించినందుకు ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. అందుకు పూర్తి భిన్నంగా ఇప్పుడు సైరా చిత్రంలో లక్ష్మీ నరసింహారెడ్డి పాత్రలో నటించినందుకు ప్రశంసలు జల్లు కురుస్తోంది.భరతనాట్య కళాకారిణిగా .. ఉద్యమ ప్రభోదకురాలిగా తమన్నా నటనకు క్రిటిక్స్ మంచి మార్కులే వేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ప్రేమించి .. ఆ అదృష్టం లేని అందాల భరిణెగా .. త్యాగధనిగా మైమరిపించే నటన కనబరిచింది. తన నాట్యంతో విప్లవాన్ని నూరిపోసే గొప్ప కళాకారిణిగా తమన్నా అభినయానికి యువతరం మంత్ర ముగ్ధం అయిపోయింది. ప్రాణత్యాగం చేసే కళాకారిణిగానూ గొప్ప అభినయం కనబరిచింది.

ఇదిగో ఆ ఉత్సాహం.. ఉల్లాసం తనలో రకరకాలుగా ఆవిష్కృతమవుతోంది. తాజాగా ఆన్ ద వే పబ్లిక్ రోడ్ లో  షికార్లు చేస్తూ తమన్నా ఇదిగో ఇలా కనిపించింది. వెళ్లేందుకు రెడీ అవుతూ.. తన కార్ వైపుగా సమీపిస్తుండగా తమన్నా కెమెరా కంటికి చిక్కింది. పూర్తిగా వైట్ అండ్ వైట్ ట్రెడిషనల్ వేర్ లో కనిపించినా ఏదో స్పైసీ థై షో ఆ డ్రెస్ లో ఎలివేట్ అవుతోంది.