గుర్తుందా... తమన్నాను ఎలా ఒప్పించారబ్బా!

Wed Dec 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Tamannaah Taking Part In Promotions Finally

ఈ వారం విడుదల అవ్వబోతున్న సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది. అందులో గుర్తుందా శీతాకాలం సినిమా ఒకటి. ఈ సినిమా గురించి మొన్నటి వరకు పెద్దగా చర్చ జరగలేదు. అసలు సినిమా విడుదల ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. హీరోయిన్ గా నటించిన తమన్నా ప్రమోషన్ కార్యక్రమాల్లో కనిపించక పోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు.



తాజాగా జరిగిన ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్నా పాల్గొంది. ఎట్టకేలకు తమన్నా గుర్తుందా శీతాకాలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవ్వడంతో యూనిట్ సభ్యులు అంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.

మొదట గుర్తుందా శీతాకాలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు తమన్నా హాజరు కాకపోవడంతో యూనిట్ సభ్యులతో గొడవలు ఉన్నాయేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ కారణంగా సినిమా విడుదల కూడా ఆలస్యం అవుతుంది అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకున్నారు.

తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్నా హాజరు అవ్వడంతో ఏం చెప్పి ఒప్పించారు.. ఆమె రావడంతో సినిమా యొక్క స్థాయి ఒక్కసారిగా పెరిగింది అంటూ మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమాలో తమన్నా కాకుండా నటించిన ఇతర నటీ నటులు ప్రమోషన్ లో పాల్గొన్నా కూడా తమన్నా ప్రమోషన్ చేస్తేనే మంచి హైప్ పెరిగే అవకాశం ఉంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా కనిపించేందుకు అదనంగా పారితోషికం ను నిర్మాతలు ఇచ్చారా లేదంటే తమన్నా మరియు చిత్ర యూనిట్ సభ్యుల మధ్య ఎవరైనా మధ్యవర్తిత్వం నెరిపి ఆమె అలక మాన్పించారా అనేది తెలియాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.