Begin typing your search above and press return to search.

రెండు దశాబ్దాల కెరీర్‌ లో తమన్నాని ఎప్పుడు ఇలా చూడలేదు

By:  Tupaki Desk   |   6 Jun 2023 2:00 PM GMT
రెండు దశాబ్దాల కెరీర్‌ లో తమన్నాని ఎప్పుడు ఇలా చూడలేదు
X
మిల్కీ బ్యూటీ తమన్నా 2005 సంవత్సరంలో తెలుగు మరియు హిందీ సినిమాల్లో ఒకే సారి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతో తమన్నా అక్కడ ఇక్కడ ఆకట్టుకోలేక పోయింది. 2007 సంవత్సరంలో హ్యాపీ డేస్ సినిమా తో సక్సెస్‌ ను దక్కించుకుని అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడకుండా దశాబ్ద కాలం పాటు స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కాబోతున్న నేపథ్యంలో ఈ అమ్మడికి ఆఫర్లు కాస్త తగ్గాయి. గతంలో మాదిరిగా యంగ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కడం లేదు. ప్రస్తుతం ఈమె చేస్తున్న పెద్ద సినిమా భోళా శంకర్ మాత్రమే. అయినా కూడా ఈ అమ్మడు పారితోషికం విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు అంటూ ఆ మధ్య మీడియాలో కథనాలు వచ్చాయి.

తాజాగా తమన్నా 'జీ కర్దా' అనే వెబ్ సిరీస్ లో నటించింది. అమెజాన్ లో జూన్‌ 15 న స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ అడల్ట్ కంటెంట్ వెబ్‌ సిరీస్ లో తమన్నా అందాలతో తన అభిమానులను ఆశ్చర్యపర్చబోతుంది. కెరీర్‌ ఆరంభం నుండి కూడా తమన్నా స్కిన్‌ షో చేస్తూ మంచి పాపులారిటీని తెచ్చుకున్న విషయం తెల్సిందే.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఇన్నాళ్ల లో ఎప్పుడు కూడా ఈ రేంజ్ లో శృంగార సన్నివేశాల్లో తమన్నాను చూడలేదు అంటూ జీ కర్దా ట్రైలర్ చూసిన నెటిజన్స్ మరియు తమన్నా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో జీ కర్దా సిరీస్ యొక్క తమన్నా తాలూకు స్క్రీన్‌ షాట్స్ వైరల్‌ అవుతున్నాయి.

తమన్నా ను వెబ్‌ సిరీస్ కోసం మరీ ఇంతగా చూస్తామని అనుకోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అందాల ఆరబోతతో తమన్నా జీ కర్దా సిరీస్ యొక్క వేడి పెంచింది. ముందు ముందు ఈమె ఇదే స్థాయిలో సిరీస్ ల్లో కుమ్మేస్తుందేమో చూడాలి.