మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ్ హిందీ చిత్రాల్లో నటిస్తూ... నటిగా మోడల్ గా నృత్య కారణిగా కూడా మంచి గుర్తింపు పొందింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె.. ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా తమన్నా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. లస్ట్ స్టోరీస్ 2లో బోల్డ్ గా కనిపించబోతుంది.
సినిమాలు వెబ్ సిరీస్ ల ద్వారానే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా ఆమె సింగపూర్ వెళ్లింది. అక్కడ దిగిన కొన్ని ఫొటోలను ఇన్ స్టా వేధికగా అభిమానులతో పంచుకుంది.
అందులో కార్గో జీన్స్ తో పాటు వైట్ లోనెక్ టీషర్లు వేసుకొని.. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ తర్వాత రెడ్ కలర్ బికినీ వేసుకొని స్విమ్ చేస్తూ రచ్చ చేసింది. అదిరిపోయే అందంతో పాటు ఆమె తినే ఫుడ్ అక్కడ కనిపించిన నత్త ఓ కొటేషన్ బ్రిడ్జిని ఫొటోలుగా తీసి షేర్ చేసింది.
అందులో తమన్నా అందంతో పాటు ఆమె ఏమేం చూసి ఎంజాయ్ చేసిందో కూడా వివరించింది. అయితే ఈమె ఈ ఫొటోలు షేర్ చేసిన రెండు గంటల్లోనే రెండున్నర లక్షల లైకుల వచ్చాయి. రెండు వేల వరకూ కామెంట్లు వచ్చాయి.
అయితే ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు... అదిరిపోయావు తెగ ఎంజాచ్ చేస్తున్నావని కామెంట్లు చేస్తున్నారు. సింగపూర్ లో ఉన్న తమన్నా ప్యాన్స్.. వెల్ కమ్ టు సింగపూర్ అని చెబుతున్నారు. రెడ్ కలర్ బికినీతో కుర్రకారు గుండెల్లో హీటెక్కిస్తున్నారని చెప్పుకొస్తున్నారు.
ఒక్క ఇన్ స్టా వేధికగానే తమన్నాకు 20.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె అందమైన ఫొటోలు వీడియోలు.. పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకే వీరంతా తమన్నాను ఫాలో అవుతున్నారు. ఆమె ఓ పోస్టు పెట్టిందంటే చాలు లైకులు షేర్లు కామెంట్లతో ఆమె ప్యాన్స్ తెగ రచ్చ చేస్తుంటారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.