ఐశ్వర రాయ్ ప్లేస్ లో మిల్కీ బ్యూటీ

Mon Aug 15 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Tamanna to Replace Aishwarya in Rajini Film

మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ కోలీవుడ్ లో సత్తా చాటింది. ఈమధ్య కాలంలో ఈ అమ్మడి జోరు అంతగా కనిపించడం లేదు. కాని అదృష్టమో ఏమో కాని పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. కమర్షియల్ సక్సెస్ లు లేకున్నా కూడా హీరోయిన్ గా ఈమె ఎప్పుడు ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది.తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కు సూపర్ స్టార్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ అనుకోని అవకాశంతో తమన్నా ఆనందతో ఎగిరి గంతేసి ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ చేయాల్సిన పాత్ర కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పడంతో ఆ సినిమాను తమన్నా చేసే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ విషయం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జైలర్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. జైలర్ సినిమా షూటింగ్ ప్రారంభించే సమయంలోనే ఐశ్వర్య రాయ్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా నటింపజేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

గతంలోనే రజినీకాంత్ తో కలిసి నటించిన ఐశ్వర్య రాయ్ మరోసారి ఆయనతో కలిసి నటించి సక్సెస్ ను దక్కించుకోవడం కన్ఫర్మ్ అన్నట్లుగా అభిమానులు నమ్మకం వ్యక్తం చేశారు.

జైలర్ సినిమా లో ఐశ్వర్య రాయ్ నటించేందుకు మొదట ఓకే చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ఆమె తప్పకుందని తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ తప్పుకోవడంతో జైలర్ సినిమా లో రజినీకాంత్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా ను ఎంపిక చేశారట. మొదటి సారి రజినీకాంత్ తో తమన్నా జత కట్ట బోతున్న నేపథ్యంలో తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ సినిమాలో రజినీకాంత్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. తప్పకుండా ఇది ఆయనకు మరో బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీకి ఈ సినిమా మరో రెండు మూడు ఏళ్లు కెరీర్ కొనసాగేలా చేస్తుందేమో చూడాలి.