బందరు మిఠాయి బోర్డరు సిపాయి సరిలేరు నీకెవ్వరోయి!

Tue Oct 22 2019 20:00:01 GMT+0530 (IST)

Tamanna item Song With Mahesh Babu for Sarileru Neekevvaru Movie

మహేష్ బాబు 26వ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కోసం దేవిశ్రీ ప్రసాద్ ఒక మాస్ మసాలా ఐటెం సాంగ్ ను ట్యూన్ చేసినట్లుగా ఇటీవలే మనం చెప్పుకున్నాం. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ఆ ఐటెం సాంగ్ ను మిల్కీ బ్యూటీ తమన్నాతో చేయించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆర్మీ నేపథ్యంలో 1970 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఈ ఐటెం సాంగ్ ను చాలా ప్రత్యేకంగా అనీల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. భారీ సెట్టింగ్ ను నిర్మించి అందులో పాట షూట్ చేయబోతున్నారు.వచ్చే నెలలో ఈ పాటను చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ పాటకు సంబంధించిన పల్లవి లీక్ అయ్యింది. బందరు మిఠాయి బోర్డరు సిపాయి అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ను దేవి శ్రీ ప్రసాద్ గతంలో ఎప్పుడు లేనంతగా మాస్ మసాలా బీట్స్ తో ట్యూన్ చేస్తున్నాడట. మహేష్ బాబు ఈమద్య కాలంలో మంచి మాస్ మసాలా ఐటెం సాంగ్ చేసిందే లేదు. కనుక మహేష్ అభిమానుల కోసం అనీల్ రావిపూడి ఈ బందరు మిఠాయి బోర్డరు సిపాయి ఐటెం సాంగ్ ను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాడట.

మహేష్ బాబు సినీ కెరీర్ లో ఈ ఐటెం సాంగ్ కు సరిలేరు నీకెవ్వరు అన్నట్లుగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తమన్నా డాన్స్ స్టెప్పులు.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ఆర్మీ సెటప్ తో ఉండే ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో మహేష్ బాబు మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడనే నమ్మకంతో మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు.