చైతూ.. ఆమెతో డేట్ కు రానన్నాడు

Sun Dec 06 2015 15:00:01 GMT+0530 (IST)

Tamanna Wants To Date with naga Chaitanya

అసలు ఈ మరయంత్రాల ప్రపంచం నుంచి దూరంగా ఏదైనా సముద్ర తీరానికి ఓ అందమైన అమ్మాయిని ఎత్తుకెళితే? ఆహా అలాంటి సందర్భం వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఆలోచనే వచ్చింది ఓ గడుగ్గాయికి. అంతే వెంటనే ఓ టీవీ షో లైవ్ లో ఈ మాటనే అడిగేశాడు. ఒకవేళ మీకు నాగచైతన్యతో కలిసి ఏదైనా సుదూర తీరాలకు వెళ్లిపోయి డేటింగ్ చేయాల్సి వస్తే వెళతారా? అని ప్రశ్నించాడు ఓ టీవీక్షకుడు. దీనికి మిల్కీ వైట్ బ్యూటీ నవ్వేస్తూ షాక్ ఇచ్చే ట్రూత్ ఒకటి చెప్పింది.నేను ఇప్పటికే లంచ్ డేట్ గురించి అడిగేశాను. కానీ అతడు ఛాన్సిస్తేగా? నన్ను చాలా సార్లు ఎవాయిడ్ చేశాడు .. అంటూ అందరికీ షాకిచ్చింది. కొన్ని సార్లు కలిసి లంచ్ చేద్దాం రా అని ఆహ్వానించాను. కానీ  తను అస్సలు స్పందించనేలేదు. అంతేనా .. ఆన్ సెట్స్ అయినా కలిసే లంచ్ చేద్దామని పిలిచినా అస్సలు రానేలేదు. మేం ఇద్దరం కలిసి ఏదైనా ధీవికి వెళ్లిపోతే మా డేటింగ్ అత్యంత బోరింగ్ గా ఉంటుందని చెప్పింది. లంచ్ కి పిలిస్తే ఆ గంటసేపు గురక పెట్టి పడుకోవడానికే ప్రాధాన్యతనిచ్చాడు మరి! అంటూ తన లోలోని బాధని వెల్లగక్కింది మిల్కీ.

ఏమో ఏదైనా.. ఒకవేళ చైతూనే స్వయంగా మిల్కీని డ్రీమ్ డేట్ కి ఆహ్వానిస్తే వెళుతుందంటారా? ఈ ప్రశ్నకు అట్నుంచి కూడా సమాధానం ఉందంటారా? అయినా చైతూ ఇలా మిల్కీని ఎవాయిడ్ చేయడం వెనక అసలు రీజన్ ఏదై ఉంటుంది? ఒకవేళ తన డ్రీమ్ గాళ్ హర్టవుతుందని భయపడ్డాడా? ఆ డ్రీమ్ గాళ్ ఎవరై ఉంటారు? చిన్న క్వశ్చన్ కు బోలెడన్ని ఆన్సర్లంతే.