యూనివర్శల్ అప్పీల్ కోసమే ఈ పాట్లు

Fri Sep 20 2019 11:34:41 GMT+0530 (IST)

Tamanna Song Highlight in Chiranjeevi Sye Raa Movie

టాలీవుడ్ ప్రొడక్షన్ విలువలు మారాయి. బడ్జెట్లు పెరిగాయి. కాన్వాసు అమాంతం పదింతలైంది. 100 కోట్ల క్లబ్ చాలడం లేదు. 300 కోట్ల క్లబ్ మినిమం అని భావించే రేంజుకు తెలుగు సినిమా ఎదిగింది. అందుకు తగ్గట్టే భారీ చిత్రాల్ని నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. అందుకోసం వందల కోట్ల బడ్జెట్లను వెచ్చిస్తున్నాయి. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత సాహో కోసం ఆ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సైరా అంతే ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ గా ప్రచారం అవుతోంది. దీని తర్వాత ఆర్.ఆర్.ఆర్ - అల్లు రామాయణం హీటెక్కిస్తున్నాయ్.ఈ మార్పు కేవలం ప్రొడక్షన్ విలువల్లోనే కాదు.. ఎంచుకునే కథాంశాలు.. అందులో యూనివర్శల్ అప్పీల్ తప్పనిసరి అయ్యింది. అందుకోసం పాటల్ని తగ్గించి కంటెంట్ లో ఎమోషన్ ఎంత అన్నది వెతుకుతున్నారు. అప్పట్లో `బాహుబలి`లో అనవసర పాటలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇటీవలే రిలీజైన సాహోలోనూ పాటల్లేవ్. జాక్విలిన్ తో ఓ పాట శ్రద్దాతో ఒక పాట పెట్టి మమ అనిపించేశారు. తదుపరి భారీ చిత్రం ఆర్.ఆర్.ఆర్ లోనూ కేవలం మూడే మూడు పాటలు ఉంటాయని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. `సైరా-నరసింహారెడ్డి` చిత్రంలోనూ యూనివర్శల్ అప్పీల్ కోసం అనవసర పాటలేవీ లేకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. కథలో స్పీడ్ ని ఎమోషన్ లెవల్ ని తగ్గించకుండా జస్ట్ రెండు అంటే  రెండే పాటల్ని తెరకకెక్కించారట. మూడో పాట టైటిల్స్ లోనే ముగుస్తుంది కాబట్టి పరిగణించాల్సిన పనేలేదు. ఈ రెండిటిలో ఒకటి డ్రమ్స్ సాంగ్. భారీగా జనసమూహంతో డ్రమ్స్ మధ్య గ్రూప్ డ్యాన్సులతో ఆకట్టుకుంటుందట. ఇక సంథింగ్ స్పెషల్ సాంగ్ ఏదైనా ఉంది అంటే.. అది తమన్నాపై చిత్రీకరించినదేనని చెబుతున్నారు. ఉన్న మూడింట మిల్కీ పాటనే హైలైట్ అట. అయితే బాహుబలి లాంటి పాన్ ఇండియన్ సినిమాతో తమన్నా పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. అప్పట్లో అవంతిక కేవలం ఒక పాట రెండు మూడు సీన్ల కే పరిమితమైందంటూ క్రిటిక్స్ విమర్శించడంతో తమన్నా అలక పానుపెక్కిందని వార్తలొచ్చాయి. అలా కాకుండా సైరాలో పాటతో పాటు పాత్ర పరంగా ప్రాధాన్యత ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. ట్రైలర్ లో తమన్నా పాత్రకు ప్రాధాన్యతను ఆపాదించారు. అది పూర్తి సినిమాలో ఎంతగా ఉంటుంది అన్నది చూడాలి.