Begin typing your search above and press return to search.

తమన్నాకి అర్జెంట్ గా ఒక్కటైనా కావాలి!

By:  Tupaki Desk   |   26 Sep 2022 11:37 AM GMT
తమన్నాకి అర్జెంట్ గా ఒక్కటైనా కావాలి!
X
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ఖతం అనుకున్న ప్రతి సారి కూడా ఏదో ఒక మంచి ఆఫర్‌ ను దక్కించుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ ఇన్నాళ్లు కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్ల సినీ కెరీర్‌ లో తమన్నా ఎప్పుడూ కూడా బిజీగానే ఉంది. ప్రస్తుతం కూడా రజినీకాంత్‌ మూవీ జైలర్ మరియు చిరంజీవి తో ఒక సినిమాలో నటించడం వల్ల ఈ అమ్మడు బిజీగానే ఉంది.

ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ ఈ అమ్మడి యొక్క స్టార్‌ డమ్‌ కి తగ్గట్లుగా సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు. ఒక వైపు చిన్న సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పెద్ద సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ మరో రెండు మూడు సంవత్సరాలు ఇండస్ట్రీలో సందడి చేయాలి అంటే ఇప్పుడు వెంటనే ఈమెకు ఒక సూపర్ హిట్‌ కావాలి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్‌ గానే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో నటిస్తున్న తమన్నా ఈ మధ్య మ్యూజిక్ ఆల్బమ్స్ మరియు ఐటం సాంగ్స్ ను కూడా చేస్తున్న విషయం తెల్సిందే. చేసిన ప్రతి చోట కూడా అందాలు ఆరబోస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూ వస్తుంది.

ముద్దుగుమ్మ తమన్నా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కాకుండా కొత్తగా ఏమీ కమిట్‌ అవ్వక పోవడంతో కెరీర్‌ ఖతం అనే చర్చ మళ్లీ మొదలు అయ్యింది.

గతంలో మాదిరిగా తమన్నా కు మళ్లీ ఒక్క ఛాన్స్ దక్కి మంచి విజయం పడితే మరి కొన్నాళ్ల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వచ్చిన ఎఫ్‌ 3 సినిమా సక్సెస్‌ అయ్యి ఉంటే ఇప్పటి వరకు మరో రెండు సినిమాలకు ఈమె కమిట్‌ అయ్యేది.

కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడు కొత్త సినిమా ఏది దక్కించుకోలేదు. అందుకే చిరంజీవి భోళా శంకర్‌ లేదా జైలర్ సినిమాల్లో ఏదైనా ఒకటి సక్సెస్ అవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.