అంతా అయిపోయాక వచ్చి నన్ను లేపండి...!

Tue Jun 02 2020 22:00:03 GMT+0530 (IST)

When it's all over, come and wake me up ...!

దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ప్రజలందరూ ఇంట్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. దీంతో షూటింగ్ లకు దూరంగా ఉంటున్న సినీ తారలందరూ సోషల్ మీడియా పుణ్యమాని అభిమానులకు మాత్రం దగ్గరగా ఉంటున్నారు. ఖాళీ సమయాల్లో వారు చేస్తున్న పనులు.. నేర్చుకుంటోన్న కొత్త విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేస్తున్నారు సినీ స్టార్స్. ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తన మాతృ భాష సింధీ నేర్చుకుంటూ.. కొత్త కొత్త వంటకాలు నేర్చుకుంటూ టైంపాస్ చేస్తోంది. డైలీ ఏదొక పోస్ట్ సోషల్ మీడియాలో పెడుతూ తన విషయాలను అభిమానులకు షేర్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తమన్నా భాటియా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజన్స్ ని ఆలోచింపజేసేదిగా ఉంది. తొడలు కనిపించేలా టీ షర్ట్ ధరించి ప్రశాంతంగా కూర్చుని రిలాక్స్ అవుతున్న ఒక ఫోటోని మిల్కీ బ్యూటీ తమన్నా పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి ఆసక్తికర క్యాప్షన్ కూడా ఇచ్చింది తమన్నా. ''అంతా అయిపోయాక నన్ను లేపండి'' అంటూ పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి మిల్కీ బ్యూటీ ఏ ఉద్దేశ్యంతో ఈ క్యాప్షన్ పెట్టిందా అంటూ నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది రసిక హృదయాలు మాత్రం తమన్నా అందాలను చూస్తూ తన్మయత్వం చెందుతున్నారు.సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ తన అందచందాలతో అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గతేడాది ఏడు సినిమాల్లో నటించిన మిల్కీ బ్యూటీ ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన డాంగ్ డాంగ్ అనే పాటలో చిందులేసింది. ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమన్నా బాలీవుడ్ లో నవాజుద్దీన్ సిద్ధికీతో 'బోలే చుడియా' సినిమాలో నటించింది. టాలీవుడ్ కి 'శ్రీ' సినిమాతో పరిచయమైన తమన్నా 'హ్యాపీడేస్' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అప్పటి నుండి ఒక్క ఏడాది కూడా ఖాళీగా లేకుండా అందివచ్చిన అవకాశాలన్నిటిని సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. టాలీవుడ్ కోలీవుడ్ స్టార్ హీరోలందరి పక్కన నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళవుతున్నా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం బాలీవుడ్ లో మరో ఛాన్స్ దక్కించుకుందని న్యూస్ వస్తోంది. ఇలా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఛాన్సెస్ దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది తమన్నా.