హాట్ లుక్స్ తో చంపేసిన తమన్నా

Thu Aug 09 2018 23:01:12 GMT+0530 (IST)

తమన్నాకు ఈ మధ్య సినిమాలు తగ్గిపోయి ఉండొచ్చు. ఆమె తరచుగా తెరపై కనిపిస్తుండకపోవచ్చు. కానీ ఆమె అంటే పడి చచ్చే వాళ్లు తక్కువేమీ కాదు. కాలం కలిసి రాక అవకాశాలు తగ్గిపోయాయి కానీ.. తమన్నా ఇప్పటికీ అందంగానే ఉంది. మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా మిల్కీ బ్యూటీ షేర్ చేసిన ఫొటో చూస్తే ఆమె ఇంకా కుర్రాళ్లకు ఎలా కిక్కెక్కించగలదో అర్థమవుతుంది. తమ్మూ ప్రస్తుతం కన్నడలో ‘కేజీఎఫ్’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇందులో యువ కథానాయకుడు యష్ హీరో. అతడితో కలిసి ‘జోకే’ అంటూ సాగే పాటలో తమన్నా స్టెప్పులేసింది. సాంగ్ మేకింగ్ సందర్భంగా తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది తమన్నా.అందులో ఆమె హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఈ పాట ఆమె అభిమానులకు కనువిందు చేయడం ఖాయమనిపిస్తోంది. ఈ పాట షూటింగ్ చాలా ఎంజాయ్ చేశానని.. ఈ చిత్ర బృందం తనకెంతో సహకరించిందని.. కన్నడ.. తెలుగు..తమిళ భాషల్లో త్వరలోనే ఈ చిత్రం రిలీజవుతుందని.. తన పాటను ఎంజాయ్ చేయాలని తమన్నా కోరింది. ఇంతకుముందు తమ్మూ కన్నడలో ‘జాగ్వార్’ అనే సినిమా కోసం కూడా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.