తమన్నా.. ముద్దులు ఆ హీరో ఒక్కడి కే!

Thu Nov 14 2019 13:14:33 GMT+0530 (IST)

తను  తెర పై ముద్దు సీన్ల లో నటించేది లేదని మరోసారి స్పష్టతను ఇచ్చింది తమన్నా భాటియా. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించింది తమన్నా.ప్రధానం గా తెలుగు తమిళ భాషల్లో చాలా సినిమాలు చేసింది. హిందీలో కూడా అడపా దడపా చేసింది.అయితే ఇప్పటి వరకూ తను తెర మీద ముద్దులు  పెట్టుకో లేదని తమన్నా స్పష్టం చేసింది. ఇది వరకూ తను నటించిన సినిమాల్లో ముద్దు సీన్లు ఉన్నట్టు గా చూపించినా.. అవేవీ నిజం గా చేసినవి కావని తమన్నా అంటోంది. వివిధ సినిమాల్లో తమన్నా హీరోలను ముద్దు పెట్టుకున్నట్టు గా సీన్లు ఉంటాయి. అయితే అవన్నీ జిమ్మిక్కు లే అని తమ్మూ అంటోంది.

తను ఇప్పటి వరకూ ముద్దు సీన్ల లో నటించ లేదని ఇక పై కూడా నటించేది లేదని ఆమె చెబుతోంది. తను పెట్టుకున్న నియమం అది అని స్పష్టం చేసింది. అయితే ఇది వరకూ కూడా తమన్నా ఈ విషయాన్ని చెప్పింది. అప్పుడు ఒక ఎక్సెప్షన్ ఇచ్చింది. ఒకే ఒక్క హీరోతో మాత్రమే తను ముద్దు సీన్లలో నటిస్తానంటూ అప్పట్లో తమ్మూ ఒక ప్రకటన చేసింది.

అలా తమన్నా చేత మినహాయింపు పొందిన హీరో హృతిక్ రోషన్. అతడి తో తను ముద్దు సీన్ల లో నటించడానికి ఓకే అని తమన్నా అప్పుడు ప్రకటించింది. ఇప్పుడు హృతిక్ పేరు ఎత్త లేదు కానీ వేరే హీరోలెవ్వరికీ ఆ ఛాన్స్ లేదని తేల్చింది ఈ నటీమణి!