నెట్ ఫ్లిక్స్ కోసం వర్క్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్..?

Wed Jun 09 2021 11:00:02 GMT+0530 (IST)

Talented director working for Netflix

'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' సినిమా రూపొందించి యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 'మహానటి' 'ఫలక్ నుమా దాస్' 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాలలో గెస్ట్ రోల్ చేసిన తరుణ్.. 'మీకు మాత్రమే చెప్తా' చిత్రంలో హీరోగా నటించాడు. ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం 'పిట్టకథలు' సిరీస్ లో భాగం అయ్యాడు. అలానే జీ5 కోసం 'రూమ్ నెం.54' వెబ్ సిరీస్ ను నిర్మించాడు. ప్రస్తుతం 'ఓ మై కడవులే' రీమేక్ కు సంభాషణలు రాస్తున్నాడు. అయితే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయినా ఇంతవరకు తదుపరి చిత్రంపై క్లారిటీ రావడం లేదు.'ఈ నగరానికి ఏమైంది 2' ఉంటుందని ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్నారు కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. మొదటి సినిమా నుంచి సురేష్ ప్రొడక్షన్స్ తో కంటిన్యూ అవుతున్న తరుణ్ భాస్కర్.. అదే బ్యానర్ లో ఓ సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ బ్యానర్ లో ఇప్పుడప్పుడే సినిమా తీసే అవకాశం లేకపోవడంతో తరుణ్ ఇప్పుడు దిగ్గజ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ కోసం వర్క్ చేస్తున్నట్లుగా ఓటీటీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రానా దగ్గుబాటి సలహాతో నెట్ ఫ్లిక్స్ తెలుగు కంటెంట్ కు తరుణ్ భాస్కర్ క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాడని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇకపోతే దర్శకుడిగా రచయితగా నటుడిగా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న తరుణ్ భాస్కర్.. 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ తెరకెక్కించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలోనే తన నెక్స్ట్ సినిమాని ప్రకటిస్తారేమో చూడాలి.