Begin typing your search above and press return to search.

షూటింగుల‌కు టీ-సీఎం కేసీఆర్ అనుమ‌తిస్తారా?

By:  Tupaki Desk   |   20 May 2020 5:30 AM GMT
షూటింగుల‌కు టీ-సీఎం కేసీఆర్ అనుమ‌తిస్తారా?
X
55రోజులుగా నిర్భంధంలో ఉంది టాలీవుడ్. షూటింగులు లేవు.. రిలీజ్ లు లేవు. థియేట‌ర్లు-మాల్స్ తెరుచుకునే ప‌రిస్థితి ఇప్ప‌ట్లో లేదు. దీంతో నిర్మాత‌లు స‌హా ప‌రిశ్ర‌మ‌లో అన్ని శాఖ‌లు గంద‌ర‌గోళ ప‌రిస్థితిని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. సినీ కార్మికుల‌కు ఉపాధి క‌రువై అల్లాడుతున్న ప‌రిస్థితి ఉంది. అయితే ఈ స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌ప‌డేదెలా? అంటే ఇప్ప‌ట్లో స‌రైన క్లారిటీ లేదు. ప్ర‌భుత్వాల వైపు నుంచి కూడా స‌రైన వివ‌ర‌ణ లేక‌పోవ‌డంతో నిర్మాత‌ల్లో కంగారు మొద‌లైంది. క‌నీసం జూన్ 1 నుంచి అయినా షూటింగుల‌కు అనుమ‌తులు ఇస్తార‌నే నిర్మాత‌లు ధీమాను క‌న‌బ‌రుస్తున్నా.. మొన్న సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి సందిగ్ధ‌త నెల‌కొంది.

టాలీవుడ్ షూటింగులు చేయాలా వ‌ద్దా? అన్న‌ది పూర్తిగా ప్ర‌భుత్వ నిర్ణ‌యం పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కేవ‌లం విన్న‌పం మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. ఆ ర‌కంగా ఇప్ప‌టికే కేసీఆర్ కి విన్న‌పం అందింది. కానీ తెలంగాణ‌లో అంత‌కంత‌కు మ‌హ‌మ్మారీ విజృంభిస్తుంటే ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. ఇత‌ర రంగాల‌కు వెసులుబాటు క‌ల్పించినా వినోద‌ప‌రిశ్ర‌మ‌కు ఆ సీన్ క‌నిపించ‌డం లేదు. జూన్ నుంచి కూడా షూటింగులు సందేహ‌మేన‌ని అర్థ‌మైపోయింది. ఆ క్ర‌మంలోనే ఇలా అయితే లాభం లేద‌నుకున్న నిర్మాత‌ల గిల్డ్ స‌భ్యులు నేరుగా సీఎం కేసీఆర్ ని క‌లిసి త‌మ గోడు విన్న‌వించుకోవాల‌ని భావించార‌ట‌. నేడు ఆయ‌న‌ను క‌లిసేందుకు వెళుతున్నార‌ని తెలుస్తోంది.

ప‌రిమిత సిబ్బందితో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తూ.. హాలీవుడ్ త‌ర‌హాలో మేం కూడా షూటింగులు చేసుకుంటామ‌ని అడిగేందుకు వెళ్లార‌ట‌. అయితే అందుకు అనుమ‌తిస్తారా? ఇప్ప‌టివ‌ర‌కూ ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో షూటింగుల‌కు అనుమ‌తుల్లేవ్. కేవ‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ వ‌ర‌కూ అనుమ‌తులిచ్చారు. ప్ర‌స్తుత ఉత్పాతం నేప‌థ్యం లో గుంపుగా సోష‌ల్ డిస్టెన్సింగ్ కి అనుకూలంగా లేని అన్ని వ్య‌వహారా‌ల్ని కార్య‌క‌లాపాల్ని నిలిపేశారు. అందువ‌ల్ల కేసీఆర్ నుంచి అనుమ‌తి ఈజీగా లభిస్తుందా? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే పెద్ద తెర బుల్లితెర షూటింగులు లేక టాలీవుడ్ ప‌రిస్థితి ఆగమ్య‌గోచ‌రంగానే ఉంది. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు క‌ల్పించిన‌ట్టే వెసులుబాటు ఏదైనా ఇస్తారా? అన్న‌ది చూడాలి.