షూటింగ్ లో వరుస ప్రమాదాలు.. డేరింగ్ హీరోయిన్స్

Sun Aug 14 2022 05:00:01 GMT+0530 (IST)

Tabu Shilpa Shetty and Samyukta Hegde were recently injured

సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు హీరోయిన్స్ కూడా యాక్షన్స్ సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వీరికి కూడా గాయాలు అవుతూ ఉంటాయి. అనుకోకుండా జరిగిన పొరపాట్ల కారణంగా కొన్నిసార్లు గ్యాప్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. రీసెంట్ గా ముగ్గురు హీరోయిన్స్ కూడా షూటింగ్ లలో గాయలపాలవ్వడంతో కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక ముగ్గురు హీరోయిన్స్ పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.టబు శిల్పా శెట్టి సంయుక్త హెగ్డే ఈ ముగ్గురు కూడా రీసెంట్గా షూటింగ్లలో పాల్గొంటూ గాయాల పాలయ్యారు. నిన్నే పెళ్ళాడతా సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైన టబు ఐదు పదుల వయసులో కూడా అదే ఎనర్జీతో వెండితెరపై కనిపిస్తోంది. అయితే రీసెంట్ గా బోళా అనే హిందీ సినిమా షూటింగ్లో పాల్గొని ఒక ముఖ్యమైన పాత్ర కోసం యాక్షన్ సీన్ లో నటించింది.  డూప్ లేకుండా నటించిన టబు ఒక కారును ఢీకొట్టే సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదమం వలన కారు అద్దం తగిలింది.

ఆ ప్రమాదంలో టబు తలకి గాయమైంది. ఇక వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స చేసే హాస్పిటల్ కు తీసుకువెళ్లగా ఒక రెండు మూడు వారాలు బ్రేక్ రెస్ట్ కావాలి అని చెప్పడంతో షూటింగ్ వాయిదా వేసుకున్నారు. అలాగే మరొక సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా యాక్షన్స్ సన్నివేశాల్లో మిగతా వారితో పోటీ పడుతూ నటించేందుకు ప్రయత్నం చేసింది.

ఆమె ఇటీవల ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు పెట్టింది. అయితే అందులో పరిగెత్తే సమయంలో ఆమె కిందపడడంతో కాలికి గాయమైంది. అందుకు సంబంధించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

దాదాపు రెండు నెలల వరకు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల్సిందే అని తెలుస్తోంది. ఇక మరొక హీరోయిన్ సంయుక్త హెగ్డే కూడా అనుకోకుండా కిందపడి కాలుకి దెబ్బ తగిలించుకుని క్రీం అనే ఒక కన్నడ సినిమాలో నటించింది. సంయుక్త మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన సన్నివేశాల్లో చాలా పోటీ పడుతూ నటించిందట.

అయితే అదుపుతప్పి కింద పడిపోవడంతో కాలికి కొంత దెబ్బ తగిలింది. దీంతో ఆమెకు కూడా ఒక రెండు నెలల వరకు విశ్రాంతి కావాలి అని వైద్యులు సూచించారు. దీంతో ఆ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. ఏదేమైనా హీరోయిన్స్ మాత్రం హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పవచ్చు.