థైస్ అందాలతో మతిపోగొట్టేసిన తాప్సి.. స్టన్నింగ్

Sat Apr 01 2023 19:32:56 GMT+0530 (India Standard Time)

Taapsee is stunning with Thai beauty

టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా మంచి ఇమేజ్ సంపాదించుకొని బాలీవుడ్ లోకి వెళ్ళిన అందాల భామ తాప్సి. ఈ అమ్మడు హిందీ ఇండస్ట్రీలో ఫిమేల్ సెంట్రిక్ కథలతో ఎక్కువగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అలాగే షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఖరారు అయ్యింది. హిందీలో ఆమె చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.ఇదిలా ఉంటే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత నటిగా తనని తాను ఈ అమ్మడు ఆవిష్కరించుకుంది. బయోపిక్ కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటిగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇక సినిమాలలో తాప్సి కాస్తా పద్ధతైన పాత్రలలో నటిస్తూ ఉన్నా కూడా బయట మాత్రం రెగ్యులర్ గా గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. ఇప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇక ఫ్యాషన్ ఈవెంట్స్ లో పాల్గొంటూ ర్యాంప్ వాక్ చేస్తూ అందాల ప్రదర్శనలో అన్ని హద్దులు చెరిపేస్తుంది.

ఆ మధ్య ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో ఎద అందాలు కనిపించే విధంగా కాస్ట్యూమ్స్ వేసి లక్ష్మి దేవి పెండెంట్ ఉన్న హారాన్ని ధరించింది. అది వివాదాస్పదంగా మారింది. తాప్సిపై శివసేన హిందుత్వ సంఘాలు కేసులు కూడా పెట్టాయి.

ఆ వివాదం ప్రస్తుతం నడుస్తూనే ఉంది. అయితే అలాంటి వివాదాలు తాప్సికి కొత్తకాదు. వాటిని పెద్దగా కేర్ చేయదు. అందుకే అందాల ప్రదర్శనని మాత్రం ఈ అమ్మడు కొనసాగుస్తూనే ఉంటుంది.

తాజాగా మరో హాట్ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. థైస్ అందాలు కనిపించే విధంగా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసి ఈమె చేసిన అందాల ప్రదర్శనని చాలా మంది లైక్ చేయడం విశేషం. ఈ ఫోటోకి 2 లక్షలకి పైగా లైక్స్ రావడం గమనార్హం. నెటిజన్లు కూడా ఈ ఫోటోపై ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.