నెలకో లక్ష అందుకు ఖర్చు పెడుతున్న తాప్సీ..!

Fri Mar 17 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Taapsee is spending lakhs per month..!

హీరోయిన్ గా ఛాన్స్ లు దక్కించుకోవడం కాదు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం.. ఆడియన్స్ లో ఏర్పడిన ఇమేజ్ ని కాపాడుకోవడం కూడా వాళ్ల మీద ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ అంటే ఎప్పుడూ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పించే అందంతో ఉండాలి. దానికి పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.ఎలా పడితే అలా.. ఏది పడితే అది తినేస్తే అందంగా కనిపించడం కష్టం. అందుకే కథానాయికలంతా కూడా వారి డైటీషియన్ కి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలో తన డైటీషియన్ ఖర్చు గురించి చెప్పి సర్ ప్రైజ్ చేసింది తాప్సీ పన్ను.

తను నెలకు 1 లక్ష రూపాయలు డైటీషియన్ కి ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చింది. తన తండ్రికి ఇష్టం లేకపోయినా సరే వాటిని ఖర్చు పెడతాను అంటుంది. డబ్బు విషయంలో అందరి తండ్రుల్లానే తన ఫాదర్ కూడా ఆలోచిస్తారని.. తన చిన్నతనంలో ఫాదర్స్ డే రోజు కూడా 10 రూపాయలు అందుకోలేకపోయానని అన్నారు తాప్సీ. ఆయనతో తన కోసం డబ్బు ఖర్చు పెట్టమని చెప్పడం చాలా కష్టమని.. అయితే డైటీషియన్ అనేది నేను చేస్తున్న వృత్తికి చాలా అవసరమని.. అందుకోసం దానికి తగిన మొత్తాన్ని ఖర్చు పెడుతున్నానని అన్నారు తాప్సీ.

సినిమాలో  చేస్తున్న పాత్రని బట్టి అందుకు తగినట్టుగా కనిపించేందుకు కూడా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందని.. దాన్ని బట్టి కూడా ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు తాప్సీ. తను మాత్రమే కాదు డైజేషన్ ప్రాబ్లం వల్ల తాప్సీ మదర్ కూడా డైటీషియన్ కి డబ్బు చెల్లిస్తుందని..

ఏదైనా అనుకున్న దానికి సమాధానం వచ్చే దాకా ఆగే ప్రసక్తే లేదని.. తన పేరెంట్స్ తనని అలా పెంచారని అన్నారు. ఇక తాప్సీ సినిమాల విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ తో కలిసి చేస్తున్న సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుంది. ఇదే కాకుండా మరో రెండు సినిమాలు చేస్తుంది తాప్సీ.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.