తాప్సీతోనే సరసమా.. తిక్క కుదిరిందా?

Wed Jul 17 2019 17:47:04 GMT+0530 (IST)

మొహంపై ఫెడీల్మని కొట్టేలా మాట్లాడడం కొందరికే చెల్లిన విద్య. ఈ టైపు వ్యవహారంలో క్వీన్ కంగన పేరు చార్ట్ లో టాప్ లో ఉంటుంది. ఈ జాబితాలో కంగన సిస్టర్ రంగోలి పేరు టాప్ 2లో ఉంటుంది. ఆ తర్వాత ఇంకెవరి పేర్లు చేర్చాలి? అంటే కొందరి పేర్లు పరిశీలించాల్సి ఉంటుంది.ఇదిగో ఓ నెటిజన్ కి కౌంటర్ వేయడంలో తాప్సీ సైతం కంగనకు ఏమాత్రం తీసిపోకుండానే కోటింగ్ ఇవ్వడం చర్చకొచ్చింది. సూటిగా తాకే పంచ్ వేసి పాపం ఆ నెటిజన్ కి సౌండ్ లేకుండా చేసింది అంతే. ఇంతకీ ఏ సందర్భం? అసలు ఆ సంభాషణ సారాంశం ఏమిటి.. అంటే .. ఇటీవల అర్జున్ రెడ్డి - కబీర్ సింగ్ ఎపిసోడ్స్ లో సందీప్ వంగాపై తాప్సీ చేసిన విమర్శ విషయంలోనే నెటిజన్ కాస్త చెలరేగి మాట్లాడాడు. మహారాష్ట్రలో ఓ వ్యక్తి తన ప్రేయసిని చంపిన వార్తను ట్యాగ్ చేస్తూ... `ఆ ఇద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారేమో... అమ్మాయిపై ప్రేమను నిరూపించుకోవడానికి ఇలా చేశాడా?` అంటూ సందీప్ ను ప్రశ్నిస్తూ తాప్సీ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా నెటిజనులు ట్రోల్స్ చేశారు. అందులో ఒకరు ``నువ్వొక చీప్ యాక్టర్ వి... నీ మానసిక స్థితి సరిగ్గా లేదేమో!`` అంటూ ట్రోల్ చేశాడు.

దానికి కౌంటర్ గా స్పందించిన తాప్సీ అంతే ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. ``ఓకే సార్... నాకు థెరపీ సెషన్స్ ఎప్పుడు ప్రారంభిస్తారు? అలాగే ఖరీదైన నటిగా మారడానికి ఎంత తీసుకుంటారో.. ఎలా బేరం కుదుర్చుకోవాలో చెప్పండి`` అంటూ వ్యంగ్యంగా స్పందించింది తాప్సీ. ద్రవోల్బణం పెరిగిపోతోంది బాబూ అంటూ నెటిజనుడిని వేడుకొంది. మొత్తానికి సామాజిక మాధ్యమాలు ట్రోలింగ్ కి వేదికగా మారాక ఇక అంతూ దరీ అన్నదే లేకుండా ఇలా సెలబ్రిటీలతో ఆడేసుకుంటున్నారు జనం. అందుకు ఘాటుగా స్పందిస్తూ సెలబ్స్ కూడా అంతే పెద్ద ట్రీటిస్తున్నారు. అలాంటి చెత్త కామెంట్లు పట్టించుకోవద్దు మ్యాడమ్ అంటూ తాప్సీని సమర్థించేవారికి తాప్సీ అదిరే ఆన్సర్ ఇచ్చారు. వాళ్లు మారాలని అనుకోను. నిజానికి ఇలాంటోళ్లే నాకు వినోదం పంచుతారు! అంటూ షాకిచ్చారు మరి. ఇలాంటోళ్లను మారమని చెబుతూ వారి హాస్యచతురతను కించపరచలేను అంటూ పంచ్ ల మీద పంచ్ లు వేశారు సుమీ!!