చెల్లెమ్మకు తాప్సీ ఖరీదైన కార్ గిఫ్ట్

Fri Jul 19 2019 17:38:12 GMT+0530 (IST)

అక్క చెల్లెళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక ఈ ఇద్దరూ. అందాల తాప్సీకి తన చెల్లాయి షాగున్ పన్ను అంటే చెప్పలేనంత ప్రేమ. షాగున్ బిజినెస్ వ్యవహారాలన్నిటికీ మనీ సర్ధుబాటు చేసేది తాప్సీనే. ఈ ఇద్దరూ కలిసి ఇదివరకూ ఓ వెడ్డింగ్ ప్లానర్ కంపెనీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి సందర్భంలో తాప్సీ తన సోదరి గురించి ప్రస్థావిస్తూ తనకు అండగా నిలుస్తుంటుంది.నేడు చెల్లెలి బర్త్ డే సందర్భంగా తాప్సీ ఇచ్చిన ట్రీట్ ఏమిటో తెలిస్తే షాకవ్వాల్సిందే. నేటి ఉదయమే తాప్సీ ఇన్ స్టాగ్రమ్ లో ఓ ఖరీదైన లగ్జరీ కార్ ప్రత్యక్షమైంది. రూ.21.34 లక్షలు పెట్టి జీప్ కంపాస్ ని కొని గిఫ్ట్ గా ఇచ్చిందట. షాగున్ కి ఇదో బిగ్ సర్ ప్రైజ్ ట్రీట్. తన లైఫ్ లో బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇదేనని అనుకోవచ్చేమో. మొత్తానికి ఆ కొత్త జీప్ కీస్ తన చేతికి అందగానే షాగున్ లో ఉత్సాహం ఉరకలెత్తి అలా సిటీలో రైడ్ కి వెళ్లి ఉంటుందనడంలో సందేహమేం లేదు.

ప్రతి ఒక్కరికి తాప్సీ లాంటి ఒక అక్క ఉంటే ఎంత బావుంటుంది? అనిపిస్తుందా?  నిజమే.. ఖరీదైన కానుకలన్నీ అందుకునే వీలుంటుంది. తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పాపులరైంది. కంటెంట్ బేస్డ్ సినిమాలతో హిట్టు మీద హిట్టు కొడుతూ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ఈ ఏడాది తాప్సీ నటించిన ప్రయోగాత్మక చిత్రం `గేమ్ ఓవర్` బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాకపోయినా తాప్సీ నటనకు మాత్రం పేరొచ్చింది. సాంద్ కి ఆంఖ్ .. ఉమానియా అనే రెండు చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్ కి రానున్నాయి.