వీడియో: బీచ్ లో ఫుల్ హ్యాపీగా సుష్

Sun Sep 15 2019 16:46:20 GMT+0530 (IST)

సీనియర్ బాలీవుడ్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు కానీ వారిలో ఇప్పటికీ నెటిజన్లను ఆకర్షించే హీరోయిన్లు మాత్రం తక్కువే ఉంటారు.  అదీ సినిమాలలో యాక్టివ్ గా లేకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ సుష్మిత మాత్రం సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడూ హాట్ టాపిక్కే. మిస్ యూనివర్స్ కిరీటం సాధించడం.. బాలీవుడ్ లో సత్తా చాటడం సుష్మిత కు ఒక కోణం అయితే.. వివాహం చేసుకోకుండా సింగిల్ మదర్ గా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచడం.. ఇప్పుడు లేటు వయసులో తనకంటే చిన్నవాడైన రోమన్ షాల్ తో డేటింగ్ చేయడం ఇలా తానో స్ట్రాంగ్ వుమన్ అని ఎప్పుడూ ప్రూవ్ చేస్తూ ఉంటుంది.సుష్మిత కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగే ఉంది.  ఇన్స్టాగ్రామ్ లో సుష్మితకు 4.7 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. వారితో నిత్యం టచ్ లో ఉంటుంది సుష్మిత.  ఇక తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసింది.   ప్రస్తుతం సుష్మిత మాల్దీవ్స్ లో తన డాటర్లు రెనీ.. అలీజా.. బాయ్ ఫ్రెండ్ రొమన్ తో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తోంది.  అక్కడ లోకేషన్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా. అందుకే అక్కడ తీసుకున్న ఒక వీడియోనే అభిమానులతో షేర్ చేసుకుంది. సముద్రపు నీటిలో నడుస్తూ.. బయటకు వచ్చి బీచ్ ఇసుకలో వాకింగ్ చేస్తూ ప్రకృతిని పూర్తిగా ఆస్వాదిస్తూ ఉంది.  ఈ వీడియోలో పొట్టిగా ఉన్న వైట్ కలర్ గౌన్ ధరించిన సుష్మిత ఏంజెల్ లాగా కనిపిస్తోంది.

ఈ వీడియోకు సుష్మిత ఇచ్చిన క్యాప్షన్ "నువ్వు నిజంగా జీవిస్తూ ఉంటే ఎంత మెరుపు ఉంటుందో.. ఇలాంటి ఉదయాలు అందంగా ఉంటాయి.  ఈ బీచ్.. ఇసుక.. సముద్రం.. ఈ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనిది."   ఈ వీడియోకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. "సుష్మిత ఎప్పుడూ స్పెషలే".. "ఆ బీచ్.. ఆ డ్రెస్.. ఆ స్మైల్ అన్నీ సూపర్".. "నీకు బాహ్యసౌందర్యమే కాదు అంతః సౌందర్యం కూడా ఉంది".. "బీచ్ లో ఏంజెల్" అంటూ నెటిజన్లు తమ స్పందన తెలిపారు.


వీడియో కోసం క్లిక్ చేయండి