తన సినిమాపై తానే పంచ్ వేసుకున్నాడు

Sat Jan 12 2019 23:00:02 GMT+0530 (IST)

Sushanth Aatadukundam Raa Released in Hindi

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఆయన వారసత్వం తీసుకుని తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన సుశాంత్ కెరీర్ ఆరంభం అయ్యి దాదాపుగా దశాబ్ద కాలం అయ్యింది. కాని ఇప్పటి వరకు కూడా సుశాంత్ కు మంచి కమర్షియల్ సక్సెస్ పడ్డది లేదు. అయినా కూడా తన ప్రయత్నం తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే ఈయన 'చి.ల.సౌ' అనే చిత్రాన్ని చేశాడు. ఆ చిత్రం ఒక మోస్తరుగా ఆడి పెట్టుబడిని రాబట్టింది. ప్రస్తుతం ఈయన తదుపరి చిత్రం ఏర్పాట్లలో ఉన్నాడు.యూట్యూబ్ విపరీతంగా పెరిగి పోయిన నేపథ్యంలో అన్ని భాషల సినిమాలు అన్ని భాషల్లో డబ్ అవుతున్నాయి. తెలుగులో విడుదలయ్యే ప్రతి పెద్ద సినిమాతో పాటు చిన్నా చితకా సినిమాలన్నీ కూడా హిందీలో డబ్ అవుతున్నాయి. హిందీలో డబ్బింగ్ వర్షన్ ను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. సుశాంత్ గతంలో నటించిన 'ఆటాడుకుందాం' చిత్రంను హిందీలో డబ్ చేసి మేరా ఇంతేకామ్ గా విడుదల చేశారు.

విడుదలకు ముందు చిన్న టీజర్ ను వదలడంతో పాటు పోస్ట్‌ర్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తన సినిమాపై తానే పంచ్ వేసుకున్నాడు. సదరు లింక్ ను మరియు పోస్టర్ ను పోస్ట్ చేసి వాటితో పాటు 'బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్' అంటూ ట్వీట్ చేశాడు. ఆటాడుకుందాం చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ ఫ్లాప్ మూవీ ఇప్పుడు డబ్ అవ్వడంతో బ్లాస్ట్ అంటూ ఫన్నీ ఇమోజీని పోస్ట్ చేసి తన సినిమా గురించి తానే కామెంట్ చేశాడు.