క్రేజీ మల్టీస్టారర్ లో సూర్య

Sun Nov 22 2020 17:40:39 GMT+0530 (IST)

Surya in Crazy Multistarrer?

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఇటీవల ఆకాశమే నీ హద్దురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో విజయ్ నటించబోతున్న సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వంలో ఒక క్రేజీ మల్టీస్టారర్ రూపొందబోతుంది. ఆ సినిమాలో ఒక హీరోగా సూర్య నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.సూర్యతో పాటు ఆ మల్టీస్టారర్ లో ఆర్య మరియు అథర్వ మురళి కూడా నటించబోతున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను బాలా ప్లాన్ చేస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు బాలా గతంలో పలు మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కించాడు. సూర్యతో 18 ఏళ్ల క్రితం పితామగన్ సినిమాను చేశాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో సూర్యకు స్టార్ డం దక్కింది. ఆ సినిమాలో విక్రమ్ కీలక పాత్రలో నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు బాలా దర్శకత్వంలో సూర్య మల్టీస్టారర్ సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.