దియాదేవ్ ఫోటోగ్రాఫ్స్ పై సూర్యదంపతుల అసంతృప్తి!

Fri Aug 12 2022 14:37:11 GMT+0530 (IST)

Surya couple's dissatisfaction with Diadev's photographs!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రోలెక్స్ పాత్రతో పాన్ ఇండియా లో ఫేమస్ అయ్యారు. అటుపై 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ రెండు ఒకేసారి జరిగాయి. దీంతో సూర్య రేంజ్ అంతకంతకు పెరిగిపోతుంది. సూర్య కళ్లకి అభిమానుల సంఖ్య ఇంకా పోరిగిపోతుంది.పబ్లిక్ గానే సూర్య ఐస్ గురించి  పొగిడేస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ సైతం సూర్య కళ్లని ఓ రేంజ్ లో మెచ్చుకున్నారు. కళ్లతోనే యాక్టింగ్ చేసే ఒకే ఒక్క స్టార్ అంటూ కితాబిచ్చారు. ఇక జ్యోతిక కూడా సూర్య కళ్లకే పడిపోయింది. ఆ కళ్లని ప్రేమించే ఇద్దరు దంపతులుగా మారారు. ఈ అందమైన జంటకు దియా -దేవ్  పిల్లలు కలరు.

కుటుంబమంటే?  సూర్యకి మరో ప్రపంచం. ఖాళీ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తారు. పిల్లలు..భార్య అంటూ చెన్నైలోనే చక్కెర్లు కొడుతుంటారు.  ఔట్ డోర్ వెకేషన్లు చాలా రేర్. అయితే తాజాగా ఈ జంట పిల్లలుతో కలిసి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ రెస్టారెంట్లో భోజనం తర్వాత ఇదిగో  ఇలా మీడియాకి చిక్కారు.

రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చ సమయంలో ఫోటోగ్రాఫర్లు ఒకరి మీద ఒకరి పడి ఫోటోలు తీసుకున్నారు. వాళ్ల బాధని అర్ధం చేసుకున్న దంపతులు ఇద్దరు కలిసి కొన్ని ఫోటోలు ఇచ్చారు. పిల్లలు దేవ్-దియాల్ని కూడా ఫోటో గ్రాఫర్లు కవర్ చేసారు. దీంతో సూర్య-జ్యోతిక అందుకు అభ్యంతరం వ్యక్తం చేసారు.  పిల్లలు ఇద్దరు ఫోటోలు తీయోద్దని..వాటిని పబ్లిష్ చేయోద్దని ఫోటోగ్రాఫర్లని కోరారు.

అయినా ఫోటోలు  తీయడం ఆపలేదు. దీంతో సూర్య వాళ్లపై ఒకింత అసహనాన్ని వ్యక్తం  చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ అసహనం దేనికి?  పిల్లలు ఇద్దర్నీ మీడియాకి..సినిమాలకు దూరంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

పిల్లల పేర్లపై సూర్య ఓ బ్యానర్ కూడా స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు.  ఛారిటీ పౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.  కానీ దియా-దేవ్ లపై మాత్రం అప్పుడే సినిమా-మీడియా అనే ముద్ర పడకుండా ముందు జాగ్రత్తగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.