Begin typing your search above and press return to search.

యాక్ష‌న్ ఫ్యాక్డ్ థ్రిల్ల‌ర్ లో సింగం గ‌ర్జ‌న షురూ!

By:  Tupaki Desk   |   17 May 2022 1:30 AM GMT
యాక్ష‌న్ ఫ్యాక్డ్ థ్రిల్ల‌ర్ లో సింగం గ‌ర్జ‌న షురూ!
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ `విక్ర‌మ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. `ఖైదీ`..`మాస్ట‌ర్` చిత్రాల‌తో బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకున్న లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌తిభ‌ను మెచ్చి క‌మ‌ల్ క‌ల్పించిన అవ‌కాశం ఇది. స్ర్కిప్ట్ ద‌శ‌లోనే క‌మ‌ల్ ని మొప్పించి ప్ర‌శంస‌లందుకున్నాడు.

దీంతో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్ర‌క‌ట‌న ద‌గ్గ‌ర నుంచి అంచనాలు మొద‌ల‌య్యాయి. అటుపై రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు అంత‌కంత‌కు హైప్ తీసుకొచ్చాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ తో అంచ‌నాలు పీక్స్ కి చేరాయి. క‌మల్..విజ‌య్ సేతుప‌తి..ప‌హ‌ద్ ఫాజిల్ పాత్ర‌లు ఆద్యంతం ర‌క్తిక‌ట్టిస్తున్నాయి. వాట్ నెక్స్ట్ అన్న తీరున ప్ర‌తీ పాత్ర ఆస‌క్తిక‌రంగా పోటాపోటీగా మ‌లిచిన‌ట్లే క‌నిపిస్తుంది.

ఈ న‌యా యాక్ష‌న్ ఫ్యాక్డ్ మూవీలో సింగం సూర్య కూడా కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈవిష‌యాన్ని ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా మేక‌ర్స్ క‌న్ప‌మ్ చేసారు. సూర్య శ‌క్తివంత‌మైన పాత్ర‌లో క‌నిపిస్తార‌ని..తెర‌పై క‌నిపించినంత సేపు ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని రివీల్ చేసారు. దీంతో సూర్య ఎంట్రీతో సినిమాకి అద‌న‌పు మైలేజ్ త‌ప్ప‌ని స‌రి తెలుస్తుంది.

ఆ మూడు పాత్ర‌ల‌తో పాటు తెర‌పై ఉన్నంత సేపు సూర్య రోల్ అంతే ధీటుగా సాగుతుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఈ యాక్ష‌న్ ప్యాక్డ్ థ్రిల్ల‌ర్ లో సింగం గ‌ర్జ‌న ఏ రేంజ్ లో ఉంటుందో రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది. మార్కెట్ ప‌రంగానూ సూర్య ఇమేజ్ తెలుగులో వ‌ర్కౌట్ అవుతుంది. సూర్య‌ టాలీవుడ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌ని ప్ర‌తీ సినిమా తెలుగు లో అనువాద‌మ‌వుతుంది.

ఇక సూర్య‌ గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇవ్వ‌డం కొత్తేం కాదు. గ‌తంలో `జూన్- ఆర్`..`కుసెల‌న్`..`మ‌న్మ‌ద నంబు`..`కో` స‌హ చాలా చిత్రాల్లో క‌నిపించారు. అయితే క‌మ‌ల్ ..సేతుప‌తి ద్వ‌యంతో క‌లిసి న‌టించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. క‌మ‌ల్ తో తెర‌ను పంచుకోవాల‌ని సూర్య ఎప్ప‌టి నుంచో ఆశ‌ప‌డుతున్నారు. ఇప్పుడా కోరిక విక్ర‌మ్ తో నెర‌వేరుతుంది. అయితే ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కేవ‌లం ప్ర‌త్యేక పాత్ర‌లోనే క‌నిపిస్తారు. క‌మ‌ల్ లాంటి హీరోకి ఫుల్ లెంగ్త్ లో సింగం తోడైతే ఆ ఎన‌ర్జీ లెవ‌ల్స్ మ‌రో లా ఉంటాయి.