క్లిక్ క్లిక్ : మెగా బ్రదర్స్ సంక్రాంతి సందడి

Sat Jan 15 2022 10:06:10 GMT+0530 (India Standard Time)

Surya And Karthi Pongal Celebrations

తమిళ స్టార్ హీరో బ్రదర్స్ సూర్య మరియు కార్తిలను అక్కడి అభిమానులు మరియు మీడియా వర్గాల వారు మెగా బ్రదర్స్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ మెగా బ్రదర్స్ తాజాగా పొంగల్ సందర్బంగా ట్రెడీషనల్ లుక్ లో కనిపించి అభిమానులకు కన్నుల వింధు చేశారు. వారి పంచె కట్టు తో వావ్ అనిపించారు. తమిళనాడు ట్రెడీషన్ లో వారు ఇలాంటి ప్రత్యేక సందర్బాల్లో ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటారు. పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటూ ఇలా కట్టెల పొయ్యి వద్ద అన్న తమ్ముళ్లు సందడి చేయడం అభిమానులకు పండుగ స్పెషల్ ట్రీట్ గా మారింది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోలు కేవలం ఆ మెగా బ్రదర్స్ అభిమానులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క తమిళ సినీ అభిమానిని అలాగే తెలుగు ప్రేక్షకులకు వావ్ అనిపించేలా నచ్చింది. సూర్య మరియు కార్తిలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తప్పకుండా ఫ్యామిలీకి ఇలాంటి ప్రత్యేక సందర్బాల్లో సమయం కేటాయిస్తూ పండుగలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా సంక్రాంతి సందర్బంగా కుటుంబం అంతా కూడా ఇలా సందడి చేశారు.

సూర్య మరియు కార్తిలు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా సూర్య నటించిన జై భీమ్ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సినిమా మరియు సేవా రంగాల్లో వీరి యొక్క విజయాలను ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా తల్చుకుంటూనే ఉన్నారు. తాజాగా వీరిద్దరు  ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం కన్నుల వింధుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా సూర్య మరియు జ్యోతికల ఫొటో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.