Begin typing your search above and press return to search.

అనుమ‌తులు ల‌భించినా రిలీజ్ ఆల‌స్య‌మే!

By:  Tupaki Desk   |   25 Oct 2020 3:30 AM GMT
అనుమ‌తులు ల‌భించినా రిలీజ్ ఆల‌స్య‌మే!
X
సూర్య హీరోగా న‌టిస్తూ సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌ టైన్ ‌మెంట్స్ బ్యాన‌ర్ ‌పై నిర్మిస్తున్న చిత్రం `సూర‌రాయిపోట్రు`. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. తెలుగులో `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` పేరుతో రిలీజ్ కాబోతోంది.

ఈ నెల 30న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ‌లో రిలీజ్ చేస్తున్న‌ట్టు హీరో సూర్య ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఏయిర్ ఇండియా నుంచి అనుమ‌తుల రాని కారణంగా ఈ చిత్ర‌న రిలీజ్ ఆగిపోయింది. ఇదే విష‌యాన్ని సూర్య వెల్ల‌డించారు కూడా. ఏయిర్ ఫోర్స్ ఏప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఏయిర్ ఫోర్స్ ‌ని ఎలా చూపించారో అన్న అనుమానంతో ఏయిర్ ఇండియా అనుమ‌తుల ఇవ్వ‌లేదు. తా‌జాగా ఈ చిత్ర రిలీజ్‌ కి ఎన్ ఓసీ ల‌భించిన‌ట్టు తెలిసింది.

దీంతో `సూర‌రాయి పోట్రు` డిజిట‌ల్ రిలీజ్ ‌కున్న అడ్డంకుల్నీ తొల‌గిపోయాయి. అయినా ముందు అనుకున్న 30న రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. సూర్య‌, ... అమెజాన్ ప్రైమ్ ద‌స‌రాని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశాయి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో రిలీజ్ డేట్ ద‌స‌రా నుంచి దీపావ‌ళికి మారే అవ‌కాశాలు వున్న‌ట్టు 2డీ ఎంట‌ర్ ‌టైన్‌ మెంట్ రాజ‌శేఖ‌ర్ పాండ్య‌న్ వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది.