Begin typing your search above and press return to search.

అక్షయ్ కుమార్ ని చూసి తెలుగు హీరోలు నేర్చుకోవాలంటున్న సురేష్ బాబు

By:  Tupaki Desk   |   9 Dec 2019 10:39 AM GMT
అక్షయ్ కుమార్ ని చూసి తెలుగు హీరోలు నేర్చుకోవాలంటున్న సురేష్ బాబు
X
ఇండస్ట్రీలో బడా నిర్మాతగా కొనసాగుతున్న సురేష్ బాబు ని కాస్త కడిపితే చాలు తెలుగు సినిమా ఎక్కడ ఉంది పక్క ఇండస్ట్రీస్ వ్యవహారాలేంటి అన్ని తెలిసిపోతాయి. తాజాగా వెంకీ మామ రిలీజ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన సురేష్ బాబు అలాంటి కొన్ని విషయాలను పంచుకున్నాడు.


ఇక వెంకీ మామ కథ ముందుగా రైటర్ జనార్దన మహర్షి నుండి ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబోట్ల ద్వారా తన దగ్గరికి వచ్చిందని తర్వాత తను కోన దగ్గరికి స్క్రిప్ట్ పంపిస్తే బాబీ లైన్ లోకి వచ్చాడని తను ఫైనల్ గా కథ రెడీ చేసి సినిమా చేశాడని తెలిపాడు.

ఇక బాలీవుడ్ లో తన ఇమేజ్ పట్టించుకోకుండా కంటెంట్ కింగ్ అనుకొని అక్షయ్ కుమార్ సినిమాలు చేస్తున్నాడని అతన్ని చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలని అన్నాడు. ఇక తెలుగులో హీరోలు సినిమాలు స్పీడప్ చేసి మంచి కంటెంట్ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక నిర్మాణంలో మణి రత్నం గ్రేట్ అంటూ చాలా పర్ఫెక్ట్ గా ప్రొడక్షన్ ప్లానింగ్ చేస్తారని చెప్పాడు సురేష్ బాబు.