Begin typing your search above and press return to search.

#అఖిల్5 సోషియో ఫాంట‌సీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా..?

By:  Tupaki Desk   |   1 Dec 2020 4:05 PM GMT
#అఖిల్5 సోషియో ఫాంట‌సీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా..?
X
అక్కినేని అఖిల్ - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సాంగత్యం తెలిసిందే. అఖిల్ కెరీర్ లో ఐదవ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా నేపథ్యం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. #అఖిల్5 సినిమా సోషియో ఫాంట‌సీ బ్యాక్ డ్రాప్ లో ఉండ‌బోతుందుట‌. అంతేకాకుండా ఇందులో అఖిల్ డ‌బుల్ యాక్ష‌న్ లో క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసమే అఖిల్ మళ్ళీ హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే సోషియో ఫాంటసీలో వచ్చిన 'అఖిల్' మూవీ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి సాహసాలు చేయబోతున్నాడని అంటున్నారు.

ఇదిలా ఉండగా సురేందర్ రెడ్డి అఖిల్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ చేయనున్నాడు. అందుకే అఖిల్5 ను వీలైనంత త్వరగా ప్రారంభించి వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ లో విడుద‌ల చేసేలా సురేందర్ రెడ్డి ప్లాన్స్ చేసుకుంటున్నాడాట. ఈ సోషియో ఫాంట‌సీ కి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్న సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి సుమారు 40 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాజెక్ట్ లోకి వెళ్లిపోవాల‌ని సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా అఖిల్ - సూరి స్టైలిష్ కాంబోలో రానున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అక్కినేని వారసుడు ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకొని ట్రాక్ లోకి వస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.