పాపం సురభి.. మైమరపించే అందం ఉన్నా ఆఫర్లు లేవు!

Thu Sep 29 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

Surabhi No Offers Despite Her Mesmerizing Beauty!

సురభి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఢిల్లీలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 'ఇవన్ వేరే మాదిరి' అనే తమిళ చిత్రంతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. సందీప్ కిషన్ హీరోగా కన్మణి దర్శకత్వంలో తెరకెక్కిన 'బీరువా' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'ఎక్స్‌ప్రెస్ రాజా' మూవీ తో సురభి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఈ మూవీ అనంతరం సురభికి ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఎటాక్' 'జెంటిల్ మేన్' 'ఒక్క క్షణం' 'ఓటర్' తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఇవేమీ సురభికి సక్సెస్ ను అందించలేకపోయాయి. తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. అక్కడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు.

చివరగా సురభి టాలీవుడ్ లో 'శశి' అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆది సాయి కుమార్ హీరోగా నటించాడు. ఈ సినిమాలోని 'ఒకే ఒక లోకం..' సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.

అయితే గత ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ మూవీ తర్వాత సురభి నుంచి మరో సినిమా వచ్చింది లేదు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్‌మెంట్లు రాలేదు.

స్టార్ హీరోల సరసన రెండు మూడు సినిమాలు చేసుంటే.. ఖచ్చితంగా ఈ అమ్మడు బిజీ హీరోయిన్ గా మారేది. కానీ స్టార్ హీరోలే కాదు.. టైర్ 2 హీరోలు కూడా సురభిని పట్టించుకోలేదు. చేసిన అడపా తడపా సినిమాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సురభి కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయింది.

మైమరిపించే అందం అంతకుమించిన నటనా ప్రతిభ ఉన్నా.. పాపం సురభికి ఇప్పుడు ఆఫర్లు మాత్రం లేవు. ఈ నేపథ్యంలోనే అవకాశాల కోసం ఈ భామ సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తోంది. తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్రకారును ఆగమాగం చేస్తోంది. మరి ఈ విధంగా అయినా సురభికి ఆఫర్లు దక్కుతాయా..? లేదా..? అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.