ఉగాది కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్

Sat Mar 18 2023 19:54:43 GMT+0530 (India Standard Time)

Superstar fans waiting for Ugadi

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. పూజా హెగ్డే శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉగాదికి ఈ మూవీ నుంచి ఓ ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు నిర్మాణ సంస్థ ట్విట్టర్ లో ప్రకటించింది.అయితే అది ఏమై ఉంటుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో టైటిల్ ని ఆ రోజు ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో అయోధ్యలో అర్జునుడు అతడే తన సైన్యం అనే టైటిల్స్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీటిలో ఒకటి ఖరారు అవుతుందని ప్రచారం నడుస్తుంది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.

 ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఉగాది రోజున మాటల మాంత్రికుడు ఇవ్వబోయే అప్డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తమిళ్ యాక్టర్ జయరామ్ కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే అల వైకుంఠపురంలో సినిమాలో జయరామ్ కీలక పాత్రలో నటించాడు.మరోసారి సూపర్ స్టార్ మూవీ కోసం అతనిని కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

అయితే అతని పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా షూటింగ్ లో కూడా జయరామ్ జాయిన్ అవ్వడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫోటోని అతని ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇక ఉగాది అప్డేట్ మాటల మాంత్రికుడి నుంచి ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి మాత్రం అటు సూపర్ స్టార్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా ఉందని చెప్పాలి.