ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా దేవుడు క్షమించడు అంటే ఇదేనేమో!

Wed Sep 15 2021 05:00:01 GMT+0530 (IST)

Superstar car in the Temple

కార్లపై కొందరు సెలబ్రిటీల మోజు అంతా ఇంతా కాదు. ఇదే కేటగిరీలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి కార్లంటే మహా మోజు. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే! దాని సంగతేంటో చూడాల్సిందే. ఆయన ఇంటి ముందు పెద్ద కార్ల గ్యారేజీనే ఉంటుంది. దానిని జనతా గ్యారేజ్ అని అభిమానులు కితాబిచ్చేస్తుంటారు. ఇందులో చాలా రకాల పాత..కొత్త మోడల్స్ కార్లు అందులో ఉంటాయి. అన్నింటికంటే టోయోటో బ్రాండ్ అంటే ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. గ్యారేజీలో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నా టోయోటో లో ఉన్న కంపెర్ట్ నెస్ ఎందులోనూ ఉండదని ఆ కారులోనే ఎక్కువగా తిరుగుతుంటారు. ఇప్పటికే ఆయన గ్యారేజీలో టోయోటో బ్రాండ్ ల్యాండ్ క్రూయిజర్.. ఆ బ్రాండ్ లో ఖరీదైన ఎమ్వీ.పీ ది వెల్డ్ ఫైర్ ని కూడా గ్యారేజీలో కొలువుదీరింది.తాజాగా మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన టయోటో ఇన్నోవా క్రిస్టాని కూడా కొనుగోలు చేసారు. భారతదేశంలో ఎక్కువగా జనాదరణ పొందిన కార్లలో ఇదొకటి. అయితే ఇప్పుడీ కారు వల్ల మోహన్ లాల్ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ దేవాలయంలో కి మోహన్ లాల్ క్రిస్టా నేరుగా వెళ్లిపోయింది. సాధారణంగా కార్లను ప్రవేశం ద్వారం వద్ద నిలిపివేస్తారు. కానీ అక్కడున్న సెక్యురిటీ సిబ్బంది మోహన్ లాల్ కారుని లోపలికి అనుమతించారు. దీంతో కారు సహా సిబ్బందిపై శ్రీకృష్ణదేవాలయ పరిపాలన విభాగాం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అధికారుల అనుమతిలేకుండా గేట్లు తెరిచినందకు సిబ్బందిపై...నేరుగా గుడి లోపలికే ప్రవేశించినందకు కారుపైనా.. కారు ఓనర్ పైనా చట్ట పరంగా చర్యలకు సిద్ధమైంది బోర్డు.

కొత్తగా కారు డెలివిరీ కాగానే పూజలు చేయించడానికి శ్రీకృష్ణ దేవాలయానికి తీసుకెళ్లారు లాల్. అక్కడ ఉన్న కొంత మంది యువత ఆ సన్నివేశాల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ రకంగా ఉన్నత అధికారుల దృష్టికి వ్యవహారం చేరడంతో చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా దేవుడు క్షమించడు అంటే ఇదేనేమో!