కెరీర్ లో 4వ సారి రిపీట్ చేయబోతున్న మహేష్

Fri May 29 2020 11:30:19 GMT+0530 (IST)

Superstar To Repeat This Heroine In His Next

సూపర్ స్టార్ మహేష్ బాబు కావాలని చేస్తాడో లేక మరేంటో కాని కొన్ని సెంటిమెంట్లను అధికంగా ఫాలో అవుతాడు. తన సినిమాల ప్రారంభోత్సవంకు హాజరు కాకపోవడంతో పాటు హీరోయిన్స్ ను రిపీట్ చేయడం విషయంలో కూడా సెంటిమెంట్ కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు త్రిష.. కాజల్.. సమంత లతో తప్ప మరే హీరోయిన్ తో రొమాన్స్ రిపీట్ చేయలేదు. ఇప్పటి వరకు 26 సినిమాలు చేసిన మహేష్ బాబు 23 మంది హీరోయిన్స్ తో సినిమాలు చేశాడు.మహేష్ బాబు తన 27వ చిత్రంకు గాను తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేసే అవకాశం ఉందట. ఈ సినిమాకు సర్కార్ వారి పాట అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. హీరోయిన్ గా కూడా మొదట కీర్తి సురేష్ ను అనుకున్నా కూడా ఆమె కాకుండా కియారా అద్వానీని ఎంపిక చేసే విషయమై ఆలోచిస్తున్నారట.

వీరిద్దరి కాంబోలో భరత్ అనే నేను చిత్రం వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో పాటు కిరాయా అద్వానీతో మహేష్ బాబు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ప్రస్తుతం కియారా అద్వానీ హిందీలో బిజీగా ఉన్నా కూడా తెలుగులో ఈమె మహేష్ బాబుతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. నమ్రత కూడా పలు సందర్బాల్లో మహేష్ కు జోడీగా కియారా అద్వానీ అయితే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేసింది. అందుకే పరశురామ్ కూడా ఆమెను ఎంపిక చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా టాక్.

సర్కార్ వారి పాటలో కియారా అద్వానీతో పాటు మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన మొత్తం విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.