సూపర్ స్టార్ రజినీకాంత్ బహిరంగ హెచ్చరిక

Sun Jan 29 2023 18:54:10 GMT+0530 (India Standard Time)

Superstar Rajinikanth Warning To Public

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన చేయించాడు. ఆ ప్రకటనలో రజినీకాంత్ యొక్క ఫొటోలను మరియు వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారు. రజినీకాంత్ యొక్క ఫొటోలను మరియు వీడియో లను అనుమతి లేకుండా ఎవరు పడితే వారు ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు.



ఇటీవల కొందరు వ్యక్తులు రజినీకాంత్ వీడియోలను మరియు ఫొటోలను దుర్వినియోగం చేసి జనాలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారట. దాంతో రజినీకాంత్ తన లాయర్ ద్వారా ఈ ప్రకటన చేయించడం జరిగిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రజినీకాంత్ యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తన ఫొటోలు మరియు వీడియోలను ఆడియోలను వినియోగిస్తున్న వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలకు రజినీకాంత్ సిద్ధం అవుతున్నాడని.. అలాగే ముందు ముందు ఎవరైనా తన పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తే కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటూ హెచ్చరించారు.

ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జైలర్ సినిమా లో రజినీకాంత్ నటిస్తున్న విషయం తెల్సిందే. చాలా సంవత్సరాలుగా రజినీకాంత్ కు సాలిడ్ సక్సెస్ లేక అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ కు జైలర్ సినిమా సక్సెస్ ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.