ఇన్నాళ్లకి ఓ 'సూపర్' రీ రిలీజ్.. ఫ్యాన్స్ కి పండుగ

Sat Apr 01 2023 19:35:45 GMT+0530 (India Standard Time)

Superstar Krishna starrer Mosagallaku Mosagadu movie re-release

ఈ మధ్య కాలంలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవ్వడం చూస్తూ ఉన్నాం. సూపర్ హిట్ చిత్రాలు మాత్రమే కాకుండా హీరోల కెరీర్ లో నిలిచి పోయే సినిమాలను అలాగే నిరాశ పరచిన సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన అట్టర్ ఫ్లాప్ చిత్రం 'ఆరెంజ్' ను రీ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే.రీ రిలీజ్ అంటే మర్చి పోయిన సినిమాను మళ్లీ గుర్తు చేయడం.. ఒకప్పటి ఆణిముత్యంను మళ్లీ తీసుకు రావడం జరిగితే అది అసలైన రీ రిలీజ్.. సూపర్ రీ రిలీజ్ అనడంలో సందేహం లేదు. మే 31వ తారీకున అదే జరగబోతుంది. దివంగత సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ కు సిద్ధం అయింది.

సూపర్ స్టార్ కృష్ణ మొదటి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానులు మోసగాళ్లకు మోసగాడు సినిమా ను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

ఇప్పటికే 4కే రెజల్యూషన్ లోకి మార్చడం జరిగిందట. సౌండ్ క్లారిటీ తో పాటు పిక్చర్ ను కూడా అద్భుతంగా ఈతరం ప్రేక్షకులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలుగు ప్రేక్షకులను ఒకప్పుడు సర్ ప్రైజ్ చేసిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం ఇప్పటికి కూడా ఇండియన్ కౌబాయ్ చిత్రాల్లో బెస్ట్ చిత్రం అనడంలో సందేహం లేదు. ఎన్నో కౌబాయ్ చిత్రాలు వచ్చినా కూడా ఈ సినిమా చాలా స్పెషల్ అంటూ ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. మహేష్ బాబుకు కూడా ఇష్టమైన ఈ సినిమాను ఫ్యాన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేయబోతున్నారు.

1971 లో విడుదల అయిన ఈ సినిమాకు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించగా సోదరుడు ఆదిశేషగిరిరావు తో కలిసి సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం కోసం కృష్ణ చాలా రిస్క్ తీసుకున్నారట. సినిమా ఫెయిల్ అయితే ఆర్థికంగా పదేళ్లు వెనక్కు వెళ్లేవాడిని అంటూ కృష్ణ బతికి ఉన్న సమయంలో చెప్పేవారు. ఇది ఫ్యాన్స్ కు అసలైన కృష్ణ జయంతి కానుక అంటూ టాక్ వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.