కొత్తగా ట్రై చేస్తున్నారు సూపర్ స్టార్లు..ఏం చేస్తారో!

Fri May 26 2023 12:27:37 GMT+0530 (India Standard Time)

Super stars are trying something new

ఇన్నోవేటివ్  స్క్రిప్ట్ లో  కోసం అన్వేషణ ఇప్పుడు మాములుగా జరగలేదు. దర్శకులతో పాటు హీరోలు కొత్త  కథలు అంటూ దాహం మీద ఉన్నారు. నాలుగు ఫైట్లు..ఆరు పాటలు పెట్టి సినిమాలు చేసే కమర్శియల్ పంథాని వదిలేసి కొత్త మార్గంలో ప్రయాణిస్తున్నారు. థియేటర్ రిలీజ్ సహా ఓటీటీ సక్సెస్ కూడా కీలకంగా మారడం..కొత్త గా ఇన్నోవేటివ్ గా ఉంటే పాన్ ఇండియాలోనే రిలీజ్ చేయడం వంటి సన్నివేశాలు హీరోల ఆలోచన విధాన్ని పూర్తిగా మార్చేసాయి.



కొత్తగా ఎవరు ? కథలు చెప్పినా శ్రద్దగా వింటున్నారు. అనుభవంతో పని లేకుండా అవకాశాలు కల్పిస్తు మన్నారు. ఇప్పుడిదే టాలీవుడ్ లో ట్రెండ్. కొత్త కథ చెప్పు..హీరో డేట్లు పట్టు అన్న విధంగా సన్నివేశం మారిపోయింది. తాజాగా కొంత మంది టాలీవుడ్ సూపర్ స్టార్లు 2023-24 లో కొత్త జానర్ చిత్రాలతోనూ ...సరికొత్త ప్రయోగాలతోనూ ప్రేక్షకాభిమానుల ముందుకు రాబోతున్నారు. ఓసారి ఆ వివరాలు చూస్తే..

కింగ్ నాగార్జున రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇదొక పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్. ఈ తరహా సినిమా  చేయడం నాగార్జునకు ఇదే తొలిసారి. ఇందులో కింగ్  సరికొత్త పాత్రలో..లుక్ లోనూ కనిపించనున్నారు. ఆయన పాత్ర రెండు కోణాల్లో కనిపించనుందని సమాచారం. మునుపెన్నడు ఈ తరహా పాత్ర పోషించలేదు. ఆ రకంగా నాగ్ కి కొత్త అనుభవం అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే నెలలో సినిమా ప్రారంభం కానుంది.

ఇక నటసింహ బాలకృష్ణ  అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 108వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య లుక్ నుంచి సంభాషణలకు కొత్తగా ఉంటాయని అనీల్ ముందే రివీల్ చేసాడు. మునుపెన్నడు చూడని సరికొత్త  బాలయ్యని ఆవిష్కరిస్తానని అభిమానులకు ప్రామిస్ చేసాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే సినిమాలో బాలయ్య డైలాగులు ఆకట్టుకుంటాయని మంచి అంచనాలున్నాయి.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'బ్రో' లో కూడా పీకే కొత్తగా కనిపిస్తారని తెలుస్తుంది. సాయితేజ్ మెయిన్ లీడ్ అయినా పీకే రోల్ డిపరెంట్ గా ఉంటుందని అంటున్నారు. దేవుడు పాత్ర అని ప్రచారం సాగుతుంది. మరి  ఆ పాత్ర ఫరిది ఎలా ఉంటుందన్నది తెలియాలి. డిఫరెంట్ గా ఉంటే పీకే కిది ప్రయోగా త్మక సినిమా అవుతుంది. ఇప్పటికే 'గోపాల గోపాల' లో దేవుడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

అలాగే మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరావు'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదోక బయోపిక్. 70 కాలంలో పేరు మోసిన స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఇది. టీఎన్ ఆర్ పాత్రలో రాజా నటిస్తున్నారు. ఇంతరకూ రవితేజ ఎలాంటి బయోపిక్ లు చేయలేదు. ఆ రకంగా రవితేజకి ఇది పూర్తిగా సరికొత్త ప్రయోగాత్మకమైన చిత్రం.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  తన ఇమేజ్ మొత్తాన్ని పక్కనబెట్టి మారుతితో ఓ హారర్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇంతవరకూ ఇలాంటి సినిమాలు డార్లింగ్ చేయలేదు. పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత డార్లింగ్ ఇలాంటి  సినిమా చేయడం అతి పెద్ద ప్రయోగంగానే భావించాలి.  ప్రభాస్ ఈ సినిమా చేయడం ఏంటని ఇప్పటికీ సినిమాపై నెగివిటీ ఉంది. వాటికి రిజల్ట్ తో మారుతి ఎలాంటి ముగింపు ఇస్తాడో చూడాలి.

అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ ఈ సినిమాని ఓ ప్రయోగంగానే భావించాలి. పొలిటికల్ స్టోరీ ఇది. 'ఒకే ఒక్కడు' తరహాలో ఉంటుందని అంచనాలున్నాయి. అప్పట్లో 'ఒకే ఒక్కడు' పెద్ద ప్రయోగం. భారీ విజయం సాధించింది. ఆ నమ్మకంతోనే శంకర్ మళ్లీ ముందుకెళ్తున్నాడు. మరి కథలో ఎలాంటి ట్విస్టులుంటాయో చూడాలి.