Begin typing your search above and press return to search.

పల్నాడు నేపథ్యంలో సూపర్ స్టార్ మూవీ

By:  Tupaki Desk   |   2 Feb 2023 10:00 PM GMT
పల్నాడు నేపథ్యంలో సూపర్ స్టార్ మూవీ
X
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ ఇది కావడం విశేషం. ఇదివరకు వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయిన కూడా ఇప్పటికీ టీవీలో, ఓటీటీలో ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంటాయి. సామాన్య ప్రజలకు కూడా ఈ సినిమాలో అద్భుతంగా చేరువయ్యాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు సూపర్ స్టార్ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో జోరు మీద ఉన్నాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వరుసగా రెండు హిట్ సినిమాలతో స్పీడ్ మీద ఉన్నాడు. ఈ నేపథ్యంలో మీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అని ప్రకటించడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీలో మహేష్ బాబుకి జోడిగా పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ కథలు కనిపిస్తాయి. ఇప్పటివరకు త్రివిక్రమ్ కి సక్సెస్ ఇచ్చిన సినిమాలు కూడా అదే జోనర్ లో తెరకెక్కినవే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే తరహా ఫ్యామిలీ ఎమోషనల్ ఎలిమెంట్ తో కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అదే సమయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకుని కాస్త యాక్షన్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో రిప్రజెంట్ చేసినట్లు సమాచారం. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు భిన్నమైన కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని టాక్.

ముఖ్యంగా పల్నాడు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ సంప్రదిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఇంపార్టెంట్ పాత్ర కోసం ఐశ్వర్యరాయ్ ని రంగంలోకి దించాలని అనుకుంటున్నారు. ఆమె ఉంటే బాలీవుడ్ లో కూడా సినిమాకి కాస్త హైప్ వస్తుందని భావించి ఈ రకంగా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే గాని తెలియదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.