గుడ్ న్యూస్ : సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్ టు వర్క్

Sat Dec 03 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Super star mahesh babu back to shooting

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇది చాలా పెద్ద వార్త. చాలా తక్కువ రోజుల గ్యాప్ లో మహేష్ బాబు తన తల్లి మరియు తండ్రిని కోల్పోయారు. తల్లి మరణం కారణంగా షూటింగ్స్ కు దూరంగా ఉండి.. మళ్లీ షూటింగ్స్ కు హాజరు అవ్వాలి అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా తండ్రి కృష్ణ చనిపోయారు. దాంతో మహేష్ మరో నెల రోజుల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉంటాడని అంతా భావించారు.మహేష్ బాబు ఇప్పటికే చాలా గ్యాప్ ఇవ్వడంతో పలు షూట్స్ ఆగిపోయాయి. దాంతో మహేష్ బాబు తన వల్ల ఇతరులకు ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశ్యంతో కాస్త ఇబ్బంది అయినా కూడా షూట్స్ కు జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు ఈ ఫొటోను షేర్ చేయడం ద్వారా చెప్పుకొచ్చాడు.

తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మౌంటెన్ డ్యూ యొక్క యాడ్ చిత్రీకరన కోసం మహేష్ బాబు కెమెరా ముందుకు వచ్చాడు. కాస్త ఎక్కువ రోజుల గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు మళ్లీ మునుపటి ఉత్సాహంతో షూటింగ్ లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మౌంటెన్ డ్యూ యొక్క యాడ్ లో మహేష్ బాబు లుక్ గురించి అంతా మాట్లాడుకునేలా ఉంది. సూపర్ హెయిర్ స్టైల్ తో పాటు ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్ తో ఈ ఫొటోలో మహేష్ బాబు ఉన్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్ చిత్రీకరణ తర్వాత ఒకటి రెండు రోజుల గ్యాప్ లోనే త్రివిక్రమ్ సినిమా యొక్క షూట్ లో మహేష్ బాబు పాల్గొంటాడు అనే సమాచారం అందుతోంది.

మొత్తానికి మహేష్ బాబు బ్యాక్ టు వర్క్ అంటూ ట్వీట్ చేయడం.. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ కు హాజరు అవ్వడం అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మహేష్ షురూ చేయబోతున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.