అదే సూపర్ స్టార్ మహేష్ చేసి వుంటే..?

Sat Oct 01 2022 17:13:54 GMT+0530 (India Standard Time)

Super star mahesh babu PS1 movie news

క్రేజీ స్టార్ లు చేయాలనుకున్న ప్రాజెక్ట్ లు చేతలు మారిన సందర్భాల చాలానే వున్నాయి. ఇక హీరో చేయాలనుకున్న సినిమా మరో హీరో చేతికి వెళ్లడం అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అయినవి వున్నాయి.అదే తరహాలో డిజాస్టర్ లు గా నిలిచిన ప్రాజెక్ట్ లు వున్నాయి. హిట్ అయితే అబ్బా మన హీరో ఎలా మిస్సయ్యాడు గురూ అంటూ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతూ వుంటుంది. అదే సమయంలో భారీ డిజాస్టర్ గా నిలిస్తే మన వాడు భలే ఎస్కేప్ అయ్యాడు కదూ అంటూ ఫ్యాన్స్ ఆనందంగా ఫీలవుతూ మరో చర్చకు తెరలేపుతుంటారు.ప్రస్తుతం ఇదే తరహా చర్చ సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. మణిరత్నం దాదాపు 30 ఏళ్ల కల `పొన్నియిన్ సెల్వన్`. ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని తను చేయని ప్రయత్నం లేదు. కలవని హీరో లేడు. ఎంజీ ఆర్ రజనీకాంత్ కమల్ హాసన్ వంటి హేమా హేమీలతో చేయాలకున్నారు. కానీ కుదరలేదు. ఫైనల్ గా ఇళయదళపతి విజయ్ సూపర్ స్టార్ మహేష్ లతో చేద్దామని ప్లాన్ చేసుకున్నారు.

అప్పటికి `బాహుబలి` రాకపోడం.. భారీ బడ్జెట్ ని పెట్టి ఈ పీరియాడికల్ డ్రామాని నిర్మించడానికి ప్రొడ్యూసర్స్ ఎవరూ సహసించడానికి ఇష్టపడకపోవడంతో ఈ ప్రాజెక్ట్ గత కొన్నేళ్లుగా పెండింగ్ లో వుంటూ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ ని టైటిల్ పాత్ర కోసం మణిరత్నం సంప్రదించారు. అయితే అనివార్య కారణాల వలల్ల తను చేయలేదు. ఆ తరువాత చియాన్ విక్రమ్ జయం రవి కార్తిలతో ఈ మూవీని తెరకెక్కించడం తెలిసిందే.

గత శుక్రవారం భారీ స్థాయిలో విడుదలైన `పొన్నియిన్ సెల్వన్ 1` ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇందులో టైటిల్ పాత్రలో జయం రవి నటించాడు. ఇదే పాత్ర కోసం గతంలో మణిరత్నం .. సూపర్ స్టార్ మహేష్ బాబుని సంప్రదించారు.

తనే గనక ఈ మూవీ చేసి వుంటే సినిమా మరింత దారుణంగా వుండేదని కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఆ పాత్రలో మహేష్ అసలు ఫిట్ అయ్యే వాడు కాదని సినిమాకు ప్రధాన మైనస్ గా నిలిచేదని ఈ విషయంలో మహేష్ గ్రేట్ ఎస్కేప్ అయ్యాడని నెట్టింట మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీపై కామెంట్ లు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.