ఆన్ లోకేషన్ : స్టైలిష్ లుక్ లో సూపర్ స్టార్

Thu Sep 16 2021 14:18:55 GMT+0530 (IST)

Super star in stylish look

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు. వచ్చే నెలలో చిత్రీకరణ ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. బ్రేక్ లేకుండా చిత్రీకరణ కంటిన్యూస్ గా జరుగుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. సర్కారు వారి పాట షూటింగ్ మొదలు అయినప్పటి నుండి మహేష్ బాబు లుక్ మరియు మహేష్ బాబు పాత్ర గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. మొదటి నుండి ఏదో ఒక విషయం లేదా ఫొటో లీక్ అవుతూనే ఉంది. తాజాగా మరోసారి మహేష్ బాబు సెట్స్ లో ఉండగా ఫొటో లీక్ అయ్యింది. బుల్లెట్ పై మహేష్ బాబు అలా స్టైలిష్ గా ఉన్న ఫొటో ప్రస్తుతం నెటిజన్స్ ను విపరీతంగా ఆకర్షిస్తోంది.పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఔట్ డోర్ లో జరుగుతోంది. బైక్ రైడింగ్ మరియు కీలక యాక్షన్ సన్నివేశం ఉంటుందని అంటున్నారు. బుల్లెట్ పై మహేష్ బాబు అలా కూర్చుని ఉన్న ఫొటో ఒకటి నెట్టింట ప్రత్యక్ష్యం అయ్యింది. దాంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ గా స్టైలిష్ లుక్ ను మహేష్ బాబు అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. కాస్త గడ్డం మీసాలు మరియు జుట్టు కాస్త ఎక్కువ ఉన్న మహేష్ బాబు లుక్ అందరికి తెగ నచ్చేస్తుంది.

మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత చేయబోతున్న సినిమాలు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయి. మొదటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. మహేష్ బాబు.. త్రివిక్రమ్ ల కాంబోలో ఇప్పటికే వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమా లు జనాలు ఎప్పటికి మర్చిపోలేరు. అంతగా సక్సెస్ ను దక్కించుకున్న ఆ రెండు సినిమాల తర్వాత మహేష్‌బాబు చేస్తున్న త్రివిక్రమ్ సినిమా ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ మరియు మహేష్ బాబుల కాంబో మూవీకి అతడే పార్థు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇక త్రివిక్రమ్ మూవీ తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబు చేయాల్సి ఉంది.