Begin typing your search above and press return to search.

వీరసింహారెడ్డికి సూపర్ స్టార్ ఫిదా.. దర్శకుడికి ఫోన్ కాల్

By:  Tupaki Desk   |   30 Jan 2023 9:10 AM GMT
వీరసింహారెడ్డికి సూపర్ స్టార్ ఫిదా.. దర్శకుడికి ఫోన్ కాల్
X
సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అందుకుని జోరుగా కలెక్షన్లు రాబట్టిన మూవీ వీరసింహా రెడ్డి. బాలయ్య బాబును ఫ్యాన్స్ ఎక్స్‌పెక్స్‌ చేసే రేంజ్ లో చూపించాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది వీర సింహారెడ్డి. బాలయ్య బాబు పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చొబెట్టాయి.

బాలకృష్ణకి బాగా అచ్చొచ్చిన రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లో మరో మాస్ మసాలా మూవీగా ప్రశంసలు అందుకుంది.

వీరసింహారెడ్డి మూవీలో సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా మందికి కనెక్ట్ అయింది. రాయలసీమ ఫ్యాక్షన్ కథలు ఇష్టపడే వారికి వీర సింహారెడ్డి బాగానే నచ్చింది. బాలయ్య బాబు మాస్ ఎలివేషన్స్ పర్ఫెక్ట్ గా కుదరడంతో ముఖ్యంగా నందమూరి అభిమానులను ఈ సినిమా బాగా అలరించింది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. గోపిచంద్ మలినేని దర్శకత్వ ప్రతిభకు అన్ని వర్గాల నుండి అప్రిసియేషన్ లభించింది. తాజాగా వీరసింహారెడ్డి సినిమా వీక్షించిన థలైవా, సూపర్ స్టార్ రజినీ కాంత్ వీర సింహారెడ్డి మూవీని తెరకెక్కించిన గోపిచంద్ మలినేనికి ఫోన్ చేశారు.

వీరసింహారెడ్డి సినిమాను ప్రశంసించారు. స్వయంగా అంతటి రజినీ కాంత్ నుండే ఫోన్ రావడంతో డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఆనందానికి అవదులు లేవు. ఇది తన జీవితంలో నమ్మలేని నిజమని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

తనకు థలైవార్, సూపర్ స్టార్ రజినీ కాంత్ నుండి ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు. రజినీ సార్ వీరసింహారెడ్డి మూవీ చూశారని, ఆయనకు సినిమా నచ్చిందని చెప్పినట్లు గోపిచంద్ వెల్లడించారు. నా సినిమా గురించి రజినీ సార్ ప్రశంసలు, ఆయన అనుభవించిన భావోద్వేగం నాకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ అని థాంక్యూ అంటూ గోపిచంద్ మలినేని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన అభిమానులు కూడా సినిమా చాలా బాగుంది సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య బాబు అంటే మామూలుగా ఉండదు మరి అంటూ చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.